ఒక చిన్న ఇల్లు, మూడు బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవి… ఇలాంటి ఇంటికి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మామూలుగా అయితే రూ.200 వరకు వస్తుంది. అయితే, అలాంటి ఇంటికి ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఇంటి యజమానికి గుండెనొప్పి వచ్చినంత పనైంది. వెంటనే విద్యుత్ శాఖాధికారుల దగ్గరకు వెళ్లి బిల్లు చూపించి ఇదేంటని అడిగితే… కట్టాల్సిందే అన్నారట. కావాలంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారట. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన పర్వతప్ప ఇంటికి కరెంట్ బిల్లు ఏకంగా రూ.1,48,371 వచ్చింది. వెంటనే అధికారులను సంప్రదించాడు. అధికారులు ఆ బిల్లును రూ.56,399కి తగ్గించి కట్టాలని చెప్పారు. తాను సాధారణ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తిని అని అంత డబ్బు కట్టాలంటే కష్టమని చెప్పాడు. మీటర్ లో తప్పులు ఉన్నాయోమో సరిచేయాలని కోరారు.
Read: రూ.30 కోట్ల హెలీకాప్టర్… రూ.26 కోట్లు డిస్కౌంట్… ఎవరూ కొనట్లేదట…!!!