అమరావతి : పదో తరగతిలో మళ్లీ మార్కుల విధానాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మార్కుల విధానాన్ని తీసుకువస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విద్యార్ధుల్లో ప్రతిభను గుర్తించేందుకు మార్కుల విధానమే సరైదంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సిఫార్సులు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈ అనుసరించే గ్రేడింగ్ విధానాన్ని 2019 వరకూ అమలు చేసింది ప్రభుత్వం. కోవిడ్ కారణంగా 2020లో పదో తరగతి పరీక్షలు రద్దు కావటంతో గ్రేడ్ పాయింట్లు ఇవ్వని పాఠశాల విద్యాశాఖ…. కరోనా ప్రభావంతో పరీక్షలు రద్దు కావటంతో 2021లోనూ గ్రేడ్ పాయింట్లు ఇవ్వాలంటూ హైపవర్ కమిటీ సిఫార్సులు చేసింది. ప్రవేశాలు, నియామకాల్లో తలెత్తుతున్న ఇబ్బందుల దృష్ట్యా 2020 విద్యా సంవత్సరం నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు పేర్కొంది పాఠశాల విద్యాశాఖ.