ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్ ముందు పెట్టాలనే దానిపై వీరంతా కలిసి భారీ కసరత్తు చేశారు.
Read Also: 4 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన నవీన్ పోలిశెట్టి!?
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. దానికి తోడు థియేటర్ల టిక్కెట్ రేట్లు పెంచకూడదని జగన్ ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఎగ్జిబిటర్స్ థియేటర్లను ఇంకా తెరవలేదు. ఈ నేపథ్యంలో టిక్కెట్ రేట్ల అంశానికి చిరంజీవి బృందం అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. దానితో పాటే థియేటర్ల ఆక్యుపెన్సీ, ఐదు ఆటల ప్రదర్శన, థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా జగన్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట.
Read Also: తన ఊబకాయం గురించి మాట్లాడిన ఎన్టీఆర్
తాజా సమాచారం ప్రకారం జగన్ ను చిరంజీవి బృందం సెప్టెంబర్ 4న కలువబోతోందని తెలుస్తోంది. జగన్ ను కలిసే బృందంలో ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేర్లూ వినిపిస్తున్నాయి. చిరంజీవి వీరిద్దరినీ తప్పకుండా తనతో రావాలని కోరారట. అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదని అంటున్నారు. చిరంజీవితో పాటు అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి వెళ్ళడంలో పెద్దంత వింతేమీ లేదు. కానీ మహేశ్ సైతం జగన్ ను కలవడానికి అంగీకరిస్తే అది ఆసక్తికరమైన అంశమే.
Read Also: మీడియాపై స్టార్ హీరోయిన్ సెటైర్!
ఎందుకంటే… ఇటీవలే మహేశ్ బావ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ కంపెనీపై జగన్ ప్రభుత్వం కాలుష్య నివారణ విషయంలో నిర్లక్ష్యం చూపిన కారణంగా కఠిన చర్యలకు ఆదేశించింది. దాంతో జగన్ ప్రభుత్వానికి గల్లా ఫ్యామిలీకి మధ్య కనిపించని వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు… ఏపీ సీఎం జగన్ ను కలవడం ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం… మరి ఏం జరుగుతుందో!!