కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గక ముందే.. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని.. తిరిగి స్కూళ్లు, విద్యాసంస్థలను ప్రారంభించింది ప్రభుత్వం… అయితే, అక్కడక్కడ వెలుగు చూస్తున్న కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి.. తాజాగా విశాఖపట్నంలోని పరవాడ జూనియర్ కళాశాలలో ఐదుగురు విద్యార్థులు కోవిడ్ బారినపడ్డారు.. కోవిడ్ లక్షణాలతో బాధపడుతోన్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురు స్టూడెంట్స్‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం.. సోమవారం వరకు కాలేజీకి సెలవు ప్రకటించింది.