టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీవి డర్టీ పాలిటిక్స్.. దాడుల ఫొటోలు చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ ఆఫీసుపై దాడులు ఎందుకు జరిగాయో, రాష్ట్రపతికి చంద్రబాబు వివరిస్తే మంచిదని సూచించిన ఆయన.. కుట్రలో భాగంగానే రాష్ట్రంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి దిగారని.. ప్రజాభిమానం ఉన్న సీఎంపై దుర్భాషలాడి ప్రజలు రెచ్చిపోయేలా చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నది టీడీపీ ప్రయత్నం అని ఆరోపించారు. 2019 నుంచి వరుసగా పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని.. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం అందుకోవడంలో విఫలమయ్యారని.. దాంతో అప్రజాస్వామికంగా, అక్రమంగా ఆర్టికల్ 356 ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు సాయిరెడ్డి.
ఇక, సీఎంపై టీడీపీ నేత బూతులు మాట్లాడారు.. ఆ పార్టీ నేతలు ఏ మాత్రం సంకోచించకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించిన సాయిరెడ్డి… సీఎం జగన్‌పై టీడీపీ నేతల దుర్భాషతో ప్రజలు తీవ్రంగా బాధపడ్డారన్నారు. రాజ్యాంగపదవిలో ఉన్న సీఎంపై చంద్రబాబు రెచ్చిపోయి మాట్లాడి దుర్బాషలాడేవారిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన ఆయన.. టీడీపీ “డర్టీ పాలిటిక్స్”పై ప్రజల ఆగ్రహం ఫలితమే ఆ పార్టీ ఆఫీసులపై దాడులని వ్యాఖ్యానించారు. దాడుల ఫొటోలు చూపి చంద్రబాబు సానుభూతి పొందాలని చూస్తున్నారని సెటైర్లు వేసిన వైసీపీ ఎంపీ.. దాడులు ఎందుకు జరిగాయన్నదానిపై బాబు సైలెంట్ గా ఉన్నారని.. పట్టాభి చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేతలు దుర్బాషలాడుతున్నారు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కుట్రలో భాగంగానే సభ్యత, సంస్కారం లేకుండా బూతులు మాట్లాడుతున్నారని.. సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!