క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నేటి నుంచి వంద రోజలు పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడలోఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్లీన్ ఏపీ కోసం చెత్త సేకరించే 4 వేల 97 వాహనాలని ప్రారంభించి.. 13 జిల్లాల కార్మికులకు అందజేయనున్నారు ముఖ్యమంత్రి. పట్టణాలలో 3 వేల 97 హైడ్రాలిక్ గార్బేజ్ ఆటోలు, 1771 ఇ-ఆటోలని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే…
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన సొంత జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, ఇవాళ రాత్రి ఇడుపులపాయలోనే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సొంత జిల్లాలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు, ఎల్లుండి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక, రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు సీఎం వైఎస్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్‌కు…
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికల ప్రచారమే జరుగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎలాగైతే ముందుస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారో? అదే రీతిన సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నపుడు ఎన్నికలకు వెళితే గెలుపు తథ్యమని కేసీఆర్ నిరూపించారు. ఈ ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తూర్పు గోదావరి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. రేపు రాజమండ్రిలో జనసేన తలపెట్టిన బహిరంగసభకు అనుమతి లేదని అర్బన్ పోలీసులు స్పష్టం చేశారు.. సభా వేదిక మార్చుకోవాలని సూచించినట్టు అడిషనల్ ఎస్పీ తెలిపారు.. బాలాజీపేటలో సభ పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయన్నారు. మరోవైపు అనుమతిలేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది జనసేన.. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రమధానం కార్యక్రమం వేదిక మార్చామని.. అనుమతి…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రోడ్ల రాజకీయం కాకరేపుతోంది.. దెబ్బతిన్న రోడ్లపై సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ చేసిన జనసేన పార్టీ.. అన్ని ఫొటోలను సేకరించి ప్రదర్శించింది.. ఇక, దెబ్బతిన్న రోడ్లను బాగుచేసేందుకు శ్రమదానం చేయాలని నిర్ణయం తీసుకుంది.. మరోవైపు.. గతంలో కంటే.. రోడ్ల నిర్వహణ ఇప్పుడు బాగుందని కొట్టిపారేస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇంకో వైపు రోడ్ల దుస్థితిపై టీడీపీ కూడా గళమెత్తింది.. రాష్ట్రంలో రోడ్ల దెబ్బకు డాక్టర్లకు ప్రాక్టీస్ పెరిగిందని ఎద్దేవా చేశారు టీడీపీ సీనియర్…
టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగింది అనేదానిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు… తనపై చర్యలు తీసుకోవాలన్న ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో వాస్తవాలను వివరిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు.. మద్యం షాపుల సంఖ్య విషయంలో తానెక్కడా అవాస్తవాలు మాట్లాడలేదని లేఖలో స్పష్టం చేసిన అచ్చెన్న.. తనపై చీఫ్ విప్ శ్రీకాంత్…
సినిమా టికెట్ల ఆన్లైన్ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. ఆ తర్వాత ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పోసాని కృష్ణ మురళి కూడా ఘాటుగా స్పందించాడు.. వీటి అన్నింటికీ కలిపే అదేస్థాయిలో మళ్లీ కౌంటర్ ఎటాక్ చేశారు పవన్.. అయితే, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడి నేను ఆ స్థాయి దిగజారదలుచుకోలేదంటూ కామెంట్ చేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
తెలుగు అకాడమీలో నిధుల గోల్మాల్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఈ వ్యవహారంలో తవ్వినా కొద్ది.. గోల్మాల్ అయిన డబ్బుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఓవైపు డిపార్ట్మెంటల్ విచారణ సాగుతుండగా.. మరోవైపు.. తెలుగు అకాడమీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇవాళ ఇద్దరిని అరెస్ట్ చేశారు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, ఇప్పటి…