ఈనెల 23న తెలంగాణ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో నందికొండ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిపై కీలక అంశాలను పేర్కొన్నారు. 1952లో అప్పటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడిగా తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని… ఈ మేరకు ప్రాజెక్టు నివేదిక రిపోర్టును బేఖాతరు చేసి నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఇష్టా రీతిగా పెంచుకుంటూపోయారని ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలో కట్లెరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించడం జరిగిందన్నారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు 1.3 లక్షల ఎకరాలు మాత్రమే అని పేర్కొన్నారు.
Read Also: ఏపీకి రమ్మని సీఎం కేసీఆర్‌ను పిలిచిందెవరు?
1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేధికకు భిన్నంగా ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును 1.3 లక్షల ఎకరాల నుంచి 3.78 లక్షల ఏకరాలకు పెంచిందన్నారు. అదే సమయం లో తెలంగాణ ఆయకట్టును 6.6 లక్షల ఎకరాల నుంచి 6.02 లక్షల ఎకరాలకు తగ్గించిందని ఆరోపించారు. ఒక లక్ష ఎకరాలను లిఫ్ట్ పథకాల ద్వారా సాగులోకి తీసుకు రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. 53 వేల ఎకరాల ఆయకట్టును చిన్న చెరువుల కింద స్తిరీకరించాల్సి ఉండగా ఈ అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించడంతో తెలంగాణ రాష్ట్రం చాలా ఆయకట్టును కోల్పోయిందన్నారు.
Read Also: కేసీఆర్ కామెంట్లకు సిగ్గుపడాలి.. మాజీ ఎంపీ కొనకళ్ళ
1969 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి నివేదిక కు అనుగుణంగా ఆధ్ర ప్రాంతంలో ఆయకట్టును 1.3 లక్షల ఏకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిందని లేఖలో పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందం లేకపోవడంతో ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు 1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఆయకట్టును కట్లెరు వాగు వరకు 1.3 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని కోరారు. జులై 15 గెజిట్ నోటిఫికేషన్‌లో షెడ్యూల్ 2లో పేర్కొన్న 4.8 నుంచి 4.14 వరకు ఉన్న అంశాలను తొలగించాలని కోరుతూ ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.