ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది… ఇక, కుప్పం మున్సిపల్ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. కుప్పంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏదో జరిగిపోతోందని చెప్పి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.. 14వ వార్డులో ప్రపోజర్ విత్ డ్రా చేయడం వల్ల ఓ నామినేషన్ తిరస్కరణకు గురై మా అభ్యర్థి ఏకగ్రీవంగా గెలిచారని తెలిపిన ఆయన.. బయట నుంచి వచ్చిన టీడీపీ నాయకులే మొన్న దాడి చేశారు.. ఒక్క అధికారిపై వందల మంది దాడికి పాల్పడ్డారని… వీడియోలో కూడా ఉన్నాయని వెల్లడించారు.
మేం అన్యాయం చేయాలనుకుంటే ఒక 14వ వార్డు మాత్రమే కాదు.. మరో 10 వార్డులు ఏకగ్రీవం చేసి ఉంటాం కదా? అని ప్రశ్నించారు మిథున్‌రెడ్డి… ప్రతి వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు తిరుగుతున్నారని విమర్శించిన ఆయన.. చీప్ పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు.. బయటి ప్రాంతాల టీడీపీ నేతలు ఇక్కడ ఉండొద్దని పోలీసులు చెప్పారు… అయినా, వారు వెళ్లకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని గౌరవంగా వాళ్ల ఇళ్లల్లో వదిలి రావడం జరిగిందన్నారు.. ఇక, కుప్పం ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేవు… చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయితీ, స్టానిక పోరు ఫలితాలే కుప్పం మున్సిపాలిటీలో మళ్లీ పునరావృతం అవుతాయని దీమా వ్యక్తం చేశారు ఎంపీ మిథున్‌రెడ్డి.