చంద్రబాబు, నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని.. లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సంచలన కామెంట్లు చేశారు.. సీఎంను దున్నపోతు అంటూ లోకేష్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. ముఖ్యమంత్రి ఇంటిని తాకుతా అంటున్నాడు.. రా.. నా కొడకా… ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు… చూస్తా అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక, లోకేష్, చంద్రబాబు తోలు ఒలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెప్పులు కుట్టిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని.. నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి ముఖ్యమంత్రి ఇంటి గుమ్మాన్ని తాకు అంటూ లోకేష్‌ను సవాల్ చేశారు.
Read Also: లోకేష్‌పై మంత్రి శంకర్ నారాయణ ఫైర్.. సీఎంపై ఇలా సమంజసమేనా..?
ఇక, లోకేష్ ఓ పిల్లపంది అంటూ మండిపడ్డారు కొడాలి నాని.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పోయిన లోకేష్ అధికారంలోకి వస్తాడా? అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు కాదు మేమే కుక్కల్ని కొట్టినట్లు కొడతామని హెచ్చరించారు. ఎయిడెడ్ స్కూళ్లను జగన్ కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అంటున్నాడు.. ఈ స్కూళ్లు జగన్ కు ఇస్తారా? ప్రభుత్వానికి ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. పులివెందులలోని సొంత స్కూల్ నే జగన్ ప్రభుత్వానికి అప్పగించారని తెలిపిన ఆయ.. పాతిక వేల ఓటర్లు ఉన్న కుప్పంలో గెలవలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడు అంటూ సెటైర్లు వేశారు.. చంద్రబాబు పంచాయతీ స్థాయికి దిగజారి పోయాడు.. చంద్రబాబు ఓ పెద్ద కుక్క, గుంట నక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో టీడీపీ ఓడిపోవటం ఖాయం అంటూ జోస్యం చెప్పిన కొడాలి.. అనంతపురం ఘటన పై ప్రభుత్వం వెంటనే స్పందించిందని.. టీడీపీ, వామపక్షానికి చెందిన విద్యార్ధి విభాగాలు ప్రవేశించటంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకుందని తెలిపారు.. పోలీసులపై రాళ్లు విసిరి విద్యార్థులు గాయపడేటట్లు చేశారన్నారు మంత్రి కొడాలి నాని.