కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవాల పై సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. కర్రల సమరంలో చాలా మంది తీవ్ర గాయాల పాయాలవుతున్నారని..కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని లేఖలో సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. దేవరగట్టు ఉత్సవాలను శాంతిభద్రతల కోణంలో మాత్రమే చూడద్దని సూచించారు సీపీఐ రామకృష్ణ. ఉత్సవాలకు ఆ రెండు రోజులు బందోబస్తు మాత్రమే కాదని… నిత్యం ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆలూరు ప్రాంతంలో 100 శాతం అక్షరాస్యత సాధించాలని..…
చంద్రబాబు ఒక పగటి వేషగాడు… పిట్టలదొర అని మంత్రి కొడాలి నాని అన్నారు. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారు. దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడు. నేను , వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆసరా వారోత్సవాలు కొనసాగుతున్నాయి. కృష్ణ జిల్లా గొల్లపూడిలో ఘనంగా ఆసరా వారోత్సవాలు చెప్పటింది ప్రభుత్వ యంత్రాంగం. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. అయితే అక్కడ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ… గడచిన మూడున్నర దశాబ్ధాల్లో ఒక్క గజం స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. పసుపు జెండాలుంటేనే పథకాలిచ్చారు. టీడీపీలాగా జన్మభూమి కమిటీలతో మాకు పనిలేదు అని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో…
దళితులను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోంది అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్టలో దళితులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ పాలనపై ఎస్సీలు వ్యతిరేకంగా ఉన్నారనే దాడులు చేసి బెదిరిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణం అవుతారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే విద్యాశాఖ మంత్రి సురేష్ ఏం చేస్తున్నారు అని అడిగారు. వైసీపీలోని ఓ…
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొంచెం తగ్గడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కాస్త తగ్గింది. దాంతో జలాశయం రేడియల్ క్రేస్ట్ గేట్లు మూసేసారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 72,852 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 65,441 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 213.8824 టీఎంసీలు ఉంది. అయితే…
కరోనా కొత్త కేసులపై దసరా పండుగ ప్రభావం స్పష్టంగా కనిపించింది.. దేశవ్యాప్తంగా ఇవాళ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.. దీనికి ప్రధాన కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే.. ఇక, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. ఏపీలోనూ టెస్ట్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.. బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,243 శాంపిల్స్ పరీక్షించగా.. 332 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఏడుగురు కోవిడ్…
వైసీపీ పెద్దల చేతి వాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి అని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అన్నారు. యూనిట్ రూ.20కి ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలులో మర్మమేంటి అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటును అధిగమించి మిగులు విద్యుత్ సాధించాం అని గుర్తు చేసారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు జగన్ ప్రభుత్వం రూ.12 వేల కోట్ల బకాయిలు ఉంచింది అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈమేరకు ప్రధాన పార్టీలన్నీ సైతం వైసీపీని ఎదుర్కొనేందుకు ధీటుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే వీటిన్నింటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి డోంట్ కేర్ అంటున్నట్లుగా ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాటిని తిప్పికొట్టేందుకు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే పీకే టీం రంగంలోకి…
భారత్‌లో ఇప్పుడు విద్యుత్ సంక్షోభంపై విస్తృతంగా చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్ కష్టాలు తప్పవనే ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే దీనిపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా.. విద్యుత్ సంక్షోభం లాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.. ఇక, దీనిపై మరింత క్లారిటీ ఇచ్చారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని… రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని స్పష్టం చేసిన ఆయన.. నిధులు ఎంతైనా వెచ్చించి విద్యుత్…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు నేషనల్ హెల్త్ మిషనులో పని చేసిన ఉద్యోగులు. తమను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగంలో నుంచి తొలగించిందని సోము వీర్రాజుకు వివరించారు బాధితులు. కరోనా రెండు సీజన్లల్లో కష్టపడి పని చేస్తే ప్రభుత్వం మాఉద్యోగాలు ఊడగొట్టిందని సోము వీర్రాజు వద్ద బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కొత్త నోటిఫికేషన్ వేస్తుందనే విషయాన్ని వీర్రాజు దృష్టికి తెచ్చారు బాధిత…