కృష్ణాజిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్యే గుడివాడలో కనిపించిన ఆయన.. ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.. ముందస్తు బెయిల్లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని..
రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభలో అధికారులకు నిరసన సెగ తాకింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారుల ఎదుట నిరసనకు దిగారు స్థానికులు.. గ్రామ సభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లులో రైతులు ఆందోళనకు దిగారు..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది... దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్‌ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం అభ్యంతరాలపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఏపీ ఇరిగేషన్ సలహదారు అధికారులతో సమావేశం అయ్యారు.. అయితే, కేంద్ర జలసంఘం.. అడిగిన లెక్కలుపై చర్చ సాగుతోంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్.. నీటి లెక్కలపై అధ్యయనం చేస్తోంది.
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసర ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో పోలీసులు బీట్ నిర్వహించారు.. తుమ్మలగుంట ఫ్లైఓవర్ పై కొంతమంది యువకులు వాహన చోదకులకు ఇబ్బందులు కల్గించే విధంగా ఫొటోషూట్ పేరుతో ఇబ్బంది కలిగిస్తున్నట్టు గుర్తించింది డ్రోన్ కెమెరా.. ఇక, డ్రోన్ కెమెరా యువకులను చిత్రీకరిస్తున్నట్లు గమనించి వెంటనే.. అక్కడి నుంచి బైకులపై పరారయ్యారు యువకులు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి యత్నాలు చేశారు.. దీని కోసం అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన విషయం విదితమే కాగా.. తాను తాడిపత్రి నియోజకవర్గంలో రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని నిర్వహించాలి, అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు పెద్దారెడ్డి..
ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆధునిక టెక్నాలజీతో ఏపీ రహదారులు పటిష్టంగా మారనున్నాయి, రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా డెన్మార్క్ డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్ బీ శాఖ వినూత్న ప్రయోగంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.
కంబదూరు మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు.. దీంతో, పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 'మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్' అంటూ కన్నీరు పెట్టుకున్నారు.