సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడంటే విచిత్రమైన వాతావరణం ఉంటుందన్న ఆయన.. ఆయన వళ్లే.. ఎండకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం ఉందని ఎద్దేవా చేశారు.. ఈ భిన్నమైన వాతావరణం కారణంగా.. ఒక్క పంట రైతులు వేయలేకపోతున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే అంటూ హాట్ కామెంట్లు చేశారు..
గోవా గవర్నర్గా అశోక్గజపతిరాజు.. సీనియర్ రాజకీయ నేత, ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ సేవలు అందించిన విజయనగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. దీంతో, ఉత్తరాంధ్రకు రెండో కీలక పదవి దక్కినట్టు అయ్యింది.. ఇప్పటికే ఒడిశా గవర్నర్గా ఉన్న కంభంపాటి హరిబాబు ఉండగా.. ఇప్పుడు గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులు అయ్యారు.. అయితే, తన 36 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి…
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.
Accident : అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో లారీలో మొత్తం 15 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే… కడప జిల్లా రైల్వేకోడూరు పరిధికి చెందిన కూలీలు, మామిడికాయలు కోసేందుకు రెడ్డిపల్లె ప్రాంతానికి వచ్చారు. పనులు పూర్తయ్యాక కోసిన కాయలను లారీలో లోడ్ చేసి తిరిగి బయలుదేరారు. అయితే చెరువు కట్ట…
Kollu Ravindra: నిన్న పేర్ని నాని గుడివాడ వెళ్తే కొడతారనే హౌస్ అరెస్ట్ డ్రామా చేశాడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడ వెళ్లే దమ్ము ధైర్యం లేక ఇంట్లో కూర్చుని హౌస్ అరెస్ట్ చేశారని చెప్పుకుంటున్నాడు.. సాక్షాత్తు జిల్లా ఎస్పీనే మేము హౌస్ అరెస్టు చేయలేదని చెప్పారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే.. అందుకే ప్రజలకు చెబుతున్నాం.. చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.. మానసికంగా వేధిస్తున్నారు.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారని సజ్జల ప్రశ్నించారు.