Minister Kollu Ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ప్రజలను పీడించుకొని తిని.. ఈరోజు నీతులు చెబుతున్నారు అని పేర్కొన్నారు.
Simhadri Appanna: విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. గిరి ప్రదక్షిణ మార్గంలో తొలి పావాంచా దగ్గర నిర్మించిన రేకుల షెడ్ కూలిపోయింది. షెడ్ కింద కాంక్రీట్ బేస్ లేకపోవడం, బరువు అధికంగా ఉండటంతో, షెడ్ కిందకి కుప్పకూలింది.
CM Chandrababu: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Vallabhaneni Vamsi: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో, ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఉన్న ఓ వైసీపీ నేత ఇంట్లో వంశీని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఆత్మీయంగా కలిసి పరామర్శించారు.
Minister Narayana: అమరావతిలో మొదటి దశలో రైతుల దగ్గర తీసుకున్న 34 వేల ఎకరాల భూమి విలువ పెరగాలి అని మంత్రి నారాయణ తెలిపారు. కొత్త పరిశ్రమలు రావాలంటే ఎయిర్ పోర్టు ఉండాలని చెప్పుకొచ్చారు. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.. ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కు సీఆర్డీఏ అనుమతి ఇచ్చింది.
Atchannaidu: 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
వైఎస్ జగన్ చూస్తే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి..
ఆదోనీలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పత్తికొండ గురుకుల స్కూల్ లో ఇంటర్ చదువుతున్న బాలిక.. వైద్యం నిమిత్తం తన తల్లితోపాటు సొంతూరు నుంచి ఎమ్మిగనూరుకు వచ్చింది.. అయితే, పొరపాటున ఆదోనీ బస్సు ఎక్కిందట బాలిక.. ఇక, చేసేది ఏమీ లేక .. ఎమ్మిగనూరు బస్సు కోసం ఆదోనీ బస్టాండ్ లో ఎదురు చూస్తుండగా కన్నేసిన ఆటో డ్రైవర్ రమేష్..