బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపధ్యంలో అన్ని శాఖలను అప్రమత్తం చేస్తూ, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతోందని, శ్రీహరికోట, తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత మండల అధికారులను అప్రమత్తం…
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక అభివృద్ధి కి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పారిశ్రామిక అభివృద్ధి పై కేంద్ర మంత్రి తో చర్చించామని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. బ్యాక్ లాగ్స్ విషయాలను కేంద్రం దృష్టికి తీసుకు వచ్చామని… దావోస్ ఈవెంట్ కు సిఎంకు ఆహ్వానం…
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని… తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… ముఖ్యంగా…
పీఆర్సీ నివేదిక విడుదల చేయాలంటూ సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసే వరకు ఇక్కడి నుంచి కదలబోమంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.. సీఎంను కలిసి సీఎస్ చర్చించిన తర్వాత నివేదిక విడుదల చేస్తారని భావించినా ఉద్యోగ సంఘాలకు నిరాశ ఎదురైంది.. అయితే, పీఆర్సీ ప్రక్రియ ప్రారభమైందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.. మరోవైపు రేపు పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకంటే.. రేపు…
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది… అయితే, ఈ పాదయాత్రలో పాల్గొనకుండా.. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు.. ఇక, ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. రైతుల మహాపాదయాత్రకు వస్తున్న స్పందన చూసి జగన్‌కు చలి జ్వరం పట్టుకుందని వ్యాఖ్యానించిన ఆయన.. మహాపాదయాత్ర రాజకీయ యాత్ర కాదు.. భావితరాల భవిష్యత్ యాత్రగా అభివర్ణించారు.. రాజధాని మార్పుపై ఇచ్చిన మాటను తప్పినందుకు జగన్ సహా వైసీపీ నేతలందరూ…
ఆంధ్రప్రదేశ్‌ను విద్యలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టేందుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నాం.. ఐదు, పదేళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ కార్యాలయంలో జరిగిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకల్లో.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందన్నారు.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి… గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 300 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది.. కారైకాల్ – శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తుండగా.. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలపై…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం… కొన్ని అండకులు ఎదురైనా వేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.. ఇక, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో పదవి కాలం ఈ నెల 27వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో.. సీఈవోగా పోలవరం అదనపు బాధ్యతలు చూస్తున్న చంద్రశేఖర్ అయ్యర్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రశేఖర్ అయ్యర్ పదవీ కాలాన్ని పొడిగించాలన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు…
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. రాష్ట్రంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య ఓసారి కిందకు.. మరోసారి పైకి కదులుతూనే ఉంది.. అయితే, కరోనాపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన సీఎం వైఎస్ జగన్.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతం కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల టీకా వేసినట్టు…
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.. ఈ సారి నెల్లూరు జిల్లాలో తుఫాన్ తీరాన్ని దాటుతుందని అంచనా వేసింది… ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం… ఇవాళ మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఇవాళ సాయంత్రం తమిళనాడులోని…