విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని అతడి ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి. Read Also: బట్టల షాపులోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్.. ఎగిరిపడ్డ యువకుడు ఈ ఘటనలో…
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చాలా కాలం నుంచి పరిటాల కుటుంబం, జేసీ కుటుంబం బద్ధ శత్రువులుగా ఉన్నాయి. గతంలో జేసీ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా… పరిటాల కుటుంబం మాత్రం తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగిస్తూ వస్తోంది. అయితే 2014 తర్వాత జేసీ కుటుంబం కూడా టీడీపీలో చేరడంతో ఈ రెండు వర్గాల మధ్య క్రమంగా దూరం తగ్గుతూ వస్తోందని టాక్ నడిచింది. Read Also: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక వచ్చే వారం విడుదల కానుంది. ఉద్యోగులు 55 శాతం పీఆర్సీ ఆశిస్తుండగా..ప్రభుత్వం మాత్రం 27 శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్సీ నివేదిక వస్తే దాన్ని బట్టి ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్.. గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1960గా కనీస మద్దతు ధర నిర్ణయించగా… కాన్ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 1940గా కనీస మద్దతు ధర నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈనెల రెండవ వారం నుంచి రాష్ట్రంలోని 8774 రైతు భరోసా…
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారి మార్పుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అభ్యంతరాలేమైనా ఉంటే ఎస్ఈసీని ఆశ్రయించాలని పిటిషనరుకు హైకోర్టు సూచించింది. ఆ మేరకు వినతి పత్రాన్ని ఎస్ఈసీకి ఇవ్వాలని పిటిషనరుకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. సదురు పిటిషనుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు తెలిపింది. రిటర్నింగ్ అధికారి ఉండగా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించారని కమిషన్‌ను ప్రశ్నించిన హై కోర్టు… ప్రత్యేక అధికారి రిటర్నింగ్ అధికారికి సహాయపడేందుకు మాత్రమే నియమించామని చెప్పారు…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమావేశం ముగిసింది.. ఒడిశా సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఈ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చించారు.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కానుంది.. ఒడిశా అభ్యంతరాలతో సుదీర్ఘంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చ సాగగా.. సీఎం వైఎస్ జగన్‌తో పాటు…
ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. గడచిన స్థానిక ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చాలా చోట్ల అభ్యర్థులని బెదిరించి విత్ డ్రా చేయించారన్న ఆయన.. పోలీసులే ఎన్నికల్లో సెటిల్మెంట్లు చేస్తూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. నామినేషన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు మేం ఎప్పుడూ తీసుకోలేదని గుర్తుచేసుకున్న టీడీపీ అధినేత.. పోటీ చేయాలనుకునే అభ్యర్థికి సహకరించాల్సిన…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,054 శాంపిల్స్ పరీక్షించగా.. 231 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 362 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 2,98,05,446 కి చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య…
ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయ్. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. నాకు సీఎం తప్ప బాస్‌లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు. విశాఖ జిల్లా అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణలో 12 స్థానాలకు, ఏపీలో 11 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. తెలంగాణలోని… ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం ఖాళీ ఉండగా…కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఉంది. ఈ నేపథ్యంలోనే.. మొత్తం తెలంగాణలో 12 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. అటు…