మహిళలపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాం… దిశ యాప్ తో మహిళల దశ మారుతుంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు వాహనాలు చెడిపోయినా దిశా యాప్ ను ఆశ్రయిస్తున్నారు… మహిళా రక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం… కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎలాగో మా ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేసి ప్రజాగ్రహాన్ని టిడిపి చవిచూసింది. వైసీపీ శ్రేణులపై దాడి చేసిన ఘటనలకు టిడిపి ఏం సమాధానం చెప్తుంది. వైసీపీ నేతలు తప్పు చేసినా చట్టం ఒకేలా పనిచేస్తుంది. ఒక్క రోజులో వ్యవస్థను మార్చలేం. రెండున్నరేళ్ల లో మహిళల భద్రతకు అనేక కార్యక్రమాలు రూపొందించాం. ప్రజలకు పోలీస్ సేవలు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నం అని పేర్కొన్నారు.