వైసీపీ సర్కార్ పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల ఫైర్ అయ్యారు. అధికారం పోతుందనే భయం వైసీపీలో మొదలైందని… ఆ భయంతోనే అసెంబ్లీలో వైసీపీ అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయడమే వైసీపీ ఉద్దేశమన్నారు. రంగా, మాధవరెడ్డి, మల్లెల బాబ్జీ అంశాలు ఈనాటివా..? ఆ అంశాలకు.. సభలో జరిగిన ఘటనలకు ఏమమన్నా సంబంధం ఉందా..? అని ఫైర్ అయ్యారు. తన గురించి పోరాడిన తల్లి-చెల్లికి జగన్ ఏం గౌరవం ఇస్తున్నారు..? అని…
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. సభలో జరిగని విషయాలను జరిగినట్టుగా కట్టుకథలు అల్లి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని, అసెంబ్లీలో చంద్రబాబు మైక్ కట్ చేస్తే టీడీపీ ఎమ్మెల్యేలు ఆయన వీడియోలు వైరల్ చేశారని అన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరైనా దూషించినట్టు వారి దగ్గర ఆధారం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి ప్రస్తావన అసెంబ్లీలో రాలేదని, ఎవరూ అమెను పల్లెత్తు మాట…
నిన్నటి రోజుజ చంద్రబాబుపైన, కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి బాలకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ప్రెస్ మీట్ అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్ణకరం అని, అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లుగాని, ఆయన శ్రీమతి పేరుగాని ఎవరూ ప్రస్తావించలేదని, అయినా దూషించారని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని…
నిన్నటి రోజున ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైసీపీ నేతలు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. పర్సనల్‌గా విమర్శించడం తగదని తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అసెంబ్లీలో జరిగిన విషయాలను ఖండించారు. Read: అనగనగా ఓ గ్రామం … ఆ గ్రామంలో…
రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ వర్షం కురిస్తే ఫర్వాలేదు. కానీ, ఎప్పడూ చూడని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుపతిలో ఎటు చూసినా వర్షం, వరద తప్పించి మామూలు నేల కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పిల్లలు, పెద్దలు ఇంటికే పరిమితం అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పిల్లలు కొందరు వరద నీటిని స్విమ్మింగ్‌పూల్ గా భావించి ఈత కొడుతున్నారు. Read: భారీగా…
అమరావతి : సీఎం నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు త్రిదండి చినజీయర్ స్వామి. రామానుజాచార్యులు అవతరించి వెయ్యి సంవత్సరాలు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్ల లోని ముచ్చింతల్ ఆశ్రమంలో సహస్రాబ్ది మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే……
తిరుపతిలో నిన్న కొద్దిగా శాంతించిన వరణుడు ఈరోజు తిరిగి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ధాటికి మళ్లి చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎటు చూసినా నీరు తప్పించి మరేమి కనిపించడంలేదు. Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత… అటు తిరుమలకు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి మెట్టు మార్గం…
ఏపీలో నాలుగు జిల్లాలను నిండా ముంచాయి వానలు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తినష్టం కల్గించాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయ్. ఇవాళ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.పది రోజుల నుంచి ఒకటే వర్షాలు. పట్టిన ముసురు తొలగలేదు. ఒకదాని తర్వాత ఒకటి వరసగా మూడు వాయు గుండాలు..తీరని నష్టాన్ని మిగిల్చాయ్. నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలో కురుస్తున్న వర్షాలతో మూడు జిల్లాలు తలకిందులయ్యాయి. భారీ కుంభవృష్టి, వరదలతో చిత్తూరు,…
ఈరోజు ఏపీ శాసనసభలో జరిగిన విషయమై స్పందించారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… ఈ రోజు శాసన సభలో పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. శాసనసభ హుందాతనం, గౌరవం కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. ఈరోజు జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు హృదయాలను గాయపరుస్తాయి. ఈ రోజు సంఘటన శాసనసభకు మాయని మచ్చగా భావించాలి అని తెలిపారు.…