టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాని నాని అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా, ఎలిమినేటి మాధవరెడ్డి హత్యలను చంద్రబాబే చేశాడని బయట మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ హత్యల గురించి సభలో చర్చించాలని మంత్రి కొడాలి నాని సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి చంద్రబాబు ఎలా మాట్లాడుతున్నాడో.. రంగా, మాధవరెడ్డి హత్యల గురించి కూడా చర్చించాల్సిన అవసరం ఉందని కొడాలి నాని అన్నారు. అన్ని విషయాలపై చర్చించాలని తాము చెప్తే… నా కుటుంబం గురించి…
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుపై తమ వ్యతిరేకతను ప్రజలు బాహాటంగానే చూపించారని ఏపీ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యానించారు. కుప్పంలో ప్రజలు కూడా టీడీపీని వ్యతిరేకించడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. శాసనమండలిలో కూడా టీడీపీ బలం పూర్తిగా పోయిందన్నారు. మండలి ఛైర్మన్‌గా తన సోదరుడు, దళితుడు మోషేన్‌రాజు ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారని జగన్ తెలిపారు. Read Also: అది కౌరవ సభ.. గౌరవం లేని సభ : చంద్రబాబు ఫైర్ చంద్రబాబు, టీడీపీ నేతలు ఆడుతున్న…
ఏపీ అసెంబ్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రెస్మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తాను సభలోకి వచ్చే సమయంలో చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.…
ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. వాయుగుండంపై బులెటిన్ విడుదల చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు..దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి- చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతారవణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతారవణ శాఖ…
అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రమైన అనంతపురంలో రాత్రి నుంచి వర్షం కురుస్తున్నది. అనంతపురంతో పాటుగా కదిరి, పుట్టపర్తిలో కూడా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని చిత్రావతి, బుక్కపట్నం చెరువుకు భారీగా వరదనీరు చేరుతున్నది. చెరుపులు పూర్తిస్తాయిలో నిండిపోవడంతో అటువైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. చిత్రావతికి భారీగా వరదనీరు చేరడంతో పుట్టపర్తి బ్రిడ్జిపైన ప్రవహిస్తోంది. Read: స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీకీ నెంబర్ వన్ ర్యాంకు దీంతో పుట్టపర్తి-కర్ణాటక నాగేపల్లికి…