ఏపీ లో కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ 33,043 శాంపిల్స్ పరీక్షించగా.. 148 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 152 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,08,95,748 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2075419 కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 2059131 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,474 కు చేరిందని.. ప్రస్తుతం 1,814 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.