ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు హస్తిన వెళ్లనున్నారు.. ఇవాళ ఉదయం పదిన్నరకు తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న సీఎం జగన్.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించనున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం.. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది..
Read Also: నేటి నుంచి వీరికి కూడా వ్యాక్సినేషన్
ఇక, కేంద్ర ఆర్ధిక శాఖ, ఏవియేషన్ మంత్రులతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇక, అందుబాటులో ఉన్న పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీకానున్నారు.. ఇప్పటికే ఢీల్లీకి చేరుకున్నారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. ఇవాళ సీఎం జగన్‌తో పాటు వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఇతర ఎంపీలు హస్తిన వెళ్లనున్నారు.. తాజాగా బీజేపీ ప్రజాగ్రహ సభ చేపట్టిన నేపథ్యంలో.. పీఎం మోదీ- సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..