ఈనెల 25న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా థియేటర్ల యజమానులకు రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నంబర్ 35 ప్రకారమే టిక్కెట్లు విక్రయించాలని.. బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పలు థియేటర్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో నెంబర్ 35 ప్రకారం టిక్కెట్లు అమ్మకుంటే సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం చర్యలు…
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి 7న తొలిరోజు సమావేశాల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది. మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి…
★ నేడు ప్రజాదీక్ష చేపట్టనున్న అమరావతి రైతులు.. వెలగపూడిలో 24 గంటల పాటు రైతుల సామూహిక నిరాహార దీక్ష.. ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష.. రాజధాని ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా దీక్ష★ ఏపీలో జిల్లాల విభజనపై నేడు రెండో రోజు కలెక్టర్లతో ప్రణాళిక శాఖ సమావేశాలు.. జిల్లాల విభజనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలపై చర్చ★ తూ.గో.: నేడు బీజేపీ ఛలో అమలాపురం కార్యక్రమం.. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌కు రాష్ట్ర…
పర్యాటక ప్రియుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా తీర్థయాత్ర రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా మార్చిలో ఉత్తర భారత యాత్రను నిర్వహిస్తోంది. రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ డీజీఎం కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ కృష్ణ వెల్లడించారు. మార్చి 19న రాజమండ్రి నుంచి ఈ రైలు బయలుదేరి సామర్లకోట, తుని, విశాఖ మీదుగా ఉత్తర భారతమంతా ప్రయాణిస్తుందని తెలిపారు. ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ 9 రోజులు, 9 రాత్రులు…
ఏపీలో వైసీపీ అధినేత జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి నేటితో వెయ్యిరోజులు పూర్తవుతోంది. వెయ్యి రోజుల పాలనలో సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ బీమా, మనబడి నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర వంటి పథకాలతో…
మేకపాటి గౌతం రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఉదయం నెల్లూరు నుంచి గౌతం రెడ్డి భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఉదయగిరి వరకు రోడ్డు మార్గం ద్వారా తరలించారు. ఈ అంతిమ యాత్రలో నేతలు, మంత్రులతో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లాకు బయలుదేరుతున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయగిరి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకుంటారు. అక్కడ దివంగత మేకపాటి గౌతం రెడ్డి బౌతికకాయానికి నివాళులు ఆర్పించి అంత్యక్రియల్లో పాల్గొంటారు. Read:…
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన భౌతికకాయాన్ని నిన్న హైదరాబాద్ నుంచి నెల్లూరుకు తరలించారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో అంత్యక్రియలు జరగనున్నాయి. నెల్లూరు నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయింది. జొన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, వాసిలి, నెల్లూరు పాలెం, డిసీ పల్లి, మర్రిపాడు, బ్రాహ్నణపల్లి మీదుగా ఉదయగిరికి అంతిమయాత్ర చేరుకోనుంది. ఉదయగిరిలో జరిగే అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్…
ఆంధ్రప్రదేశ్‌లో కియా మోటార్స్ కంపెనీ కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున కార్లను ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు అనంతపురం ప్లాంట్ నుంచి 5 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్టు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది. ఇందులో నాలుగు లక్షల కార్ల దేశీయ మార్కెట్లోకి విడుదల చేయగా, లక్ష కార్లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచంలోని 91 దేశాలకు కియా కార్లను ఉత్పత్తి చేస్తున్నట్టు…