ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లు, ఇతర సమస్యలపై సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది… మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సూపర్‌స్టార్ మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను కలవడం.. సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలపడం జరిగిపోయాయి.. ఇక, త్వరలోనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందంటూ ఈ సందర్భంగా చిరంజీవి ప్రకటించారు.. కానీ, ఇప్పటి వరకు అది కార్యరూపం…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. భీమ్లానాయక్ మూవీ విడుదల నేపథ్యంలో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని కొందరు థియేటర్ యజమానులు కక్కుర్తికి తెర తీశారు. నెల్లూరులోని స్పైస్ సినిమా థియేటర్ నిర్వాహకులు ప్రస్తుతం ఇదే పనిలో పడ్డారు. తమ థియేటర్లో భీమ్లా నాయక్ సినిమా చూడాలంటే సినిమా టిక్కెట్‌తో పాటు ఫుడ్ కూపన్ కూడా కొనాల్సిందేనని షరతు పెట్టారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా టిక్కెట్ కోసం వస్తే…
అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నట్టుండి సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ…
సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపత దేవస్థానం (టీటీడీ).. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్‌లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది… సర్వదర్శనం భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది… వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి… ఇక, శుక్ర, శని,…
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఉద్యోగుల బదిలీల గడువును మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 3 తేదీ వరకు ఆన్లైన్లో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం… ఇక, మార్చి 4 నుంచి 8 తేదీ వరకు సంబంధిత హెచ్‌వోడీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుందని తన ఉత్తర్వుల్లో వైద్యారోగ్య శాఖ పేర్కొంది.. బదిలీ ప్రక్రియను…
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు 14417 అనే టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం నాణ్యత, మెనూ అమలు, మరుగుదొడ్ల నిర్వహణ, పాఠశాలల నిర్వహణ, విద్యాకానుక పంపిణీ, ఉపాధ్యాయుల గైర్హాజరు, ఇతర అకడమిక్ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదులు, అభిప్రాయాలు వెల్లడించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ వెల్లడించింది. కాగా మధ్యాహ్న భోజనం పథకంలో మెనూను…
★ హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో రూ.7వేల కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి నిరంజన్‌రెడ్డి★ నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికలే ఎజెండాగా పలువురు ముఖ్య నేతలతో కేసీఆర్ మంతనాలు★ సంగారెడ్డి: ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం… భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న జగ్గారెడ్డి★ నేడు ప్రొ.కబడ్డీ 8వ సీజన్ ఫైనల్.. పట్నా పైరేట్స్‌తో తలపడనున్న దబాంగ్ ఢిల్లీ.. రాత్రి 8:30…
ఏపీలో భీమ్లా నాయక్ సినిమాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పవర్‌స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన అంశంపై ప్రభుత్వం, జనసేన కార్యకర్తల మధ్య వివాదం చెలరేగుతోంది. అయితే ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య స్పందించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ ప్రభుత్వం భీమ్లా నాయక్ సినిమాపై చర్యలకు దిగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఒక సినిమా పట్ల జగన్ సర్కారు…
రాజధాని అమరావతిలో రైతులు ఉద్యమం ప్రారంభించి నేటితో సరిగ్గా 800 రోజులు అవుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమరావతి కోసం తాము ప్రాణ సమానమైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంతో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం సాగిస్తున్నారు. తమ…
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, 7,218 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. తాజా పోస్టులను జిల్లా యూనిట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. గతంలో మండల, పట్టణ యూనిట్‌గా వాలంటీర్లను నియమించగా.. ఇప్పుడు గ్రామాల్లో 4,213, పట్టణాల్లో 3,005 వాలంటీర్ల ఖాళీల భర్తీకి జిల్లాను యూనిట్‌గా తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.…