ఏపీలోని చిత్తూరు జిల్లాలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులపై జంతుబలి కేసు నమోదైంది. భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా కొందరు పవన్ అభిమానులు మేకను బలిచ్చినట్టు చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు. పవర్‌స్టార్…
ఏపీ కేబినెట్ జగన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్ అందుకోసం ఏపీ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయాలని కూడా తీర్మానించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో 35 కీలక అంశాలపై చర్చ జరిగింది. విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు కేబినెట్…
మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేంద్రం చట్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో శివరామకృష్ణ కమిటీ వేసి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. కానీ చంద్రబాబు నారాయణ కమిటీ వేసి నిర్ణయం తీసుకున్నారని బొత్స ఆరోపించారు. రాజధానిపై ఆనాటి ప్రకటన ఏదైనా పార్లమెంట్‌కు పంపలేదు కాబట్టి హైదరాబాదే 2024 వరకు రాజధాని అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధాని…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్…
మేషం :– ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారికి, పత్రికా, వార్తా మీడియా వారికి ఏకాగ్రత ముఖ్యం. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. వ్యాపారాల్లో ఎదురైన పోటీని తట్టుకోవటానికి ఆకర్షణీయమైన పథకాలు అమలుచేయండి. వృషభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం అధికం. ప్రేమికులలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారుటార్గెట్లు పూర్తి కాగలవు.…
వైసీపీ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభం అవుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. వైసీపీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జ్‌గా విజయసాయిరెడ్డిని ఇటీవల సీఎం జగన్ నియమించగా.. అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ సభ్యత్వ నమోదులో ప్రతిఫలించాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. తెలుగువారు…
ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీ రాజధానిగా అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను సీపీఐ నేత రామకృష్ణ కోరారు. ఏపీ హైకోర్టు తీర్పును జగన్ సర్కారు గౌరవించాలని హితవు పలికారు. అమరావతి రాజధాని విషయంలో న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య తగాదా పెట్టే…
మేషం :- దైవ, శుభ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ క్షణమైనా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సూచనలున్నాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికం. వ్యాపారాలల్లో పోటీ, ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. అందరూ అయిన వారే అనుకుని మోసపోయే ఆస్కారం ఉంది. వృషభం :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో మెరుగైన పురోభివృద్ధి సాధిస్తారు. విద్యార్థుల్లో ఆందోళన తొలగి నిశ్చింతకు లోనవుతారు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు టూ అసెంబ్లీ సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే పాతూరు-గుండుగొలను హైవే మధ్యలో సైకిల్ యాత్ర చేస్తున్న రామానాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ ప్రమాదవశాత్తూ సైకిల్ నుంచి జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా నిమ్మల సైకిల్ నుంచి…