ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు సంబంధించిన గెజిట్ ఏ క్షణంలోనైనా విడుదల కానుంది… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపింది.. మొత్తంగా 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానుండగా… కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కాబోతోంది.. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర కేబినెట్. దీంతో.. ఏ క్షణంలోనైనా గెజిట్ విడుదల కానుంది.
Read Also: Dharmana Krishna Das: సింహం సింగిల్‌గానే.. పందులే గుంపులుగా వస్తాయి..
ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో సగటున 8 మండలాలు ఉంటాయి.. ఒక్కో జిల్లాలో కనీసం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, గరిష్టంగా 8 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.. ఇక, రెండు జిల్లాల పేర్లలో సవరణలు చేశారు.. మన్యం జిల్లా పేరు పార్వతీపురం మన్యం జిల్లాగా మార్పు చేసిన ప్రభుత్వం.. శ్రీ బాలాజీ తిరుపతి జిల్లా పేరు తిరుపతి జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.