మేషం :- వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. బంధు మిత్రుల కలయిక వలన నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ సంతానం కోసం విరివిగా ధన వ్యయం చేస్తారు. వృషభం :- విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. కొబ్బరి, పూలు పండ్లు, చల్లనిపానియ వ్యాపారులకు లాభదాయకం. సమయానుకూలంగా మీ…
విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే కాగా, ఆ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు జగన్.. రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోనే ఉండాలని స్పష్టం చేశారాయన.. ఇక, త్వరలోనే వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరగనుంది.. అసెంబ్లీ బడ్జెట్ సమావేవాలు జరుగుతుండగానే వైఎస్సార్ సీఎల్పీ భేటీ ఉంటుందని తెలిపారు సీఎం జగన్… గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన అనంతరం…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 8న మంగళవారం నాడు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాజువల్ లీవ్‌ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి మహిళా సదస్సును పండుగలా జరుపుకోవాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో…
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ,…
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌కు ఇటీవల కాలంలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు శాంతి పూజలు నిర్వహించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులందరూ కలిసి అర్చకుల చేత విశేష పూజలు చేయించడంతో.. ఇలా ఎందుకు చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులను తగ్గించడానికి అంటూ పోలీసులు సమాధానం చెప్పడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆదివారం…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేబినెట్.. పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై కూడా నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఓ సారి పరిశీలిస్తే.. ★ స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం.★ రాష్ట్రంలో ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను…
ఏపీలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె భర్త బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బ్రదర్ అనిల్ స్పందించారు. ఏపీ వేదికగా తాము కొత్త పార్టీ పెడుతున్నామన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కూడా బ్రదర్ అనిల్…
తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వస్తున్న వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెడుతున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.. ఆ మధ్య మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పారు వైఎస్ షర్మిల. రాజకీయ పార్టీ అన్నది ఎవరైనా.. ? ఎక్కడైనా పెట్టవచ్చు అన్నారు. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను రాజకీయ పార్టీ పెట్టకూడదని…