ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 13 జిల్లాల్లో పాలన ప్రారంభమైంది.. జిల్లాల పునర్విభజనతో మొత్తం 26 జిల్లాల్లో ఇవాళ్టి నుంచి పాలన అందిస్తున్నారు.. కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే కాగా.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.. మరోవైపు.. కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించారు అధికారులు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ సీఎస్ రజత భార్గవ… అయితే, ఈ రిజిస్ట్రేషన్ చార్జీల సవరణ కొత్తగా ఏర్పాటైన 13 జిల్లా కేంద్రాల్లో మాత్రమే వర్తించనుంది… కొత్త జిల్లా కేంద్రాల ఆస్తుల విలువ పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది… అర్బన్, రూరల్ ప్రాంతాల మార్కెట్ విలువ సవరించాలని నిర్ణయం తీసుకుంది.
AP: సీఎం జగన్ షెడ్యూల్‌లో మార్పులు.. కేబినెట్ భేటీ సమయం కూడా మారింది..

Whatsapp Image 2022 04 04 At 4.33.21 Pm