శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… మరోసారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాంది… జులై మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. కాగా, శ్రీవారి దర్శన టికెట్లతో పాటు సేవా టికెట్లను భక్తుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది.. ఆన్‌లైన్‌లో పెట్టిన కొన్ని గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే.
Read Also: Threats to Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణ హాని..! పాక్ ప్రధాని కీలక ఆదేశాలు