మొదట సినిమాల్లో నటించిన రోజా.. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు.. ఇక, వైసీపీ చేరిన తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు.. మంత్రి పదవి కూడా చేపట్టారు.. అయితే, తనను సినిమాల్లోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి తీకొచ్చింది ఎవరు అనే విషయంపై పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించిన విషయం తెలసింది.. ఇవాళ తిరుపతిలోని బ్లిస్ హోటల్ లో మంత్రి రోజాను ఘనంగా సన్మానించింది ఏపీ హోటల్ అసోసియేషన్.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నన్ను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మాజీ ఎంపీ శివప్రసాదేనని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇక, టూరిజంలో హోటళ్లది ముఖ్య భూమిక అని.. కోవిడ్ -19 వల్ల హోటల్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారన్న ఆమె.. తిరుపతిలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Read Also: Revanth Reddy : మీ నాయనా ఢిల్లీ నాయకుల బూట్ల నాకితే.. నువ్వు సినిమా వాళ్ళ సంక నాకుతవ్..
తిరుపతి జూపార్కులో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి రోజా… చంద్రగిరి కోట అభివృద్ధికి తిరుపతివాసిగా కృషి చేస్తానన్న ఆమె.. ఏపీ టూరిజానికి టీటీడీ దర్శన టికెట్ల కోటా పెంపునకు ప్రయత్నాలు చేస్తానన్ఆరు.. తిరుపతిలో టీటీడీ గదుల బుకింగ్ కౌంటర్ ఏర్పాటు అవశ్యకతను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని.. నిర్వాహకుల అభ్యర్థన మేరకు హోటల్ పనివేళల పెంపుకు కృషి చేస్తానన్నారు. ఏపీలో అన్ని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా ఒక యాప్ రూపాందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఇక, రాష్ట్రం కోసం ఎంత కష్టపడతానో.. సొంత ప్రాంతం తిరుపతి అభివృద్ధికి కూడా అంతే కష్టపడతానని వెల్లడించారు మంత్రి ఆర్కే రోజా.