వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా కొత్త నినాదం అందుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అన్నవరంలో తుని, ప్రత్తిపాడు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మన నినాదం అన్నారు.. క్విట్ ఇండియా ఉద్యమం లాగే ఈ ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఈడుస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు.. కౌరవ సభను.. గౌరవ సభ చేసిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతామని శపథం చేసినట్టు గుర్తుచేసుకున్నారు.
Read Also: Avanthi Srinivas: చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. అవంతి ఫైర్
రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో ఆవేదన, ఆవేశం ఉందన్నారు చంద్రబాబు.. సీఎం జగన్ ఈ రాష్ట్రాన్ని తగల పెడుతున్నారని ఆరోపించిన ఆయన.. నేను చాలా మంది ప్రతి పక్ష నాయకులను చూశాను.. కేసులు పెడితే భయపడతామా..? మరింతి రెచ్చిపోతాం.. పోరాడతామని హెచ్చరించారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పనులు తమ హయాంలోనే 70 శాతం పూర్తి చేశామని తెలిపారు చంద్రబాబు.. కొర్రీలు పెట్టడంతో పోలవరంపై కేంద్ర సర్కార్ వెనక్కి వెళ్లిపోయిందన్న ఆయన.. పోలవరం డయాగ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి నేను కారణం అంటున్నారు.. భార్య భర్తలు విడిపోయినా నేనే కారణం అంటారు ఏమో? అంటూ సెటైర్లు వేశారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించని సీఎం వైఎస్ జగన్.. ఇక మూడు రాజధానులు ఎలా కడతారు..? అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.