ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఆయన టీఆర్ఎస్ పార్టీతో పనిచేస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి మంతనాలు కూడా జరిపారు. అయితే జాతీయ రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా.. పలు రాష్ట్రాలలో ఇతర పార్టీలతో ఒప్పందాలు ఉన్న కారణంగా ఇది వర్కవుట్ కాదని తెలిసి వెనకడుగు వేశారు. ఈ మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో…
ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఈనెల 27న బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఇటీవల మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నానాయాగీ చేశారని.. చంద్రబాబు వస్తున్నారని తెలిసి మేకప్ వేసుకుని వచ్చారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్‌కు లేని పవర్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పెన్ను, పేపర్ ఉందని నోటీసులు ఇచ్చి.. ఎలా రారో చూస్తామంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని…
అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్న భూ హక్కు, భూ రక్ష, కీలక ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు – నేడు, స్పందన కింద అర్జీల పరిష్కారం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కనీసం 60శాతం ఉపాధి హామీ పనులను పూర్తిచేయాలన్నారు. కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు కరోనా నుంచి విముక్తి లభించినట్టేనా..? మహమ్మారి మాయం అయినట్టేనా? అంటే ఇప్పుడు సమాధానం చెప్పలేని ప్రశ్నే.. అయితే, ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది.. ఎందుకంటే..? ఈరోజు కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు.. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చగా మారింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అమర్నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, పవన్‌పై అమర్నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్నాథ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్‌పై ఇంతలా విరుచుకుపడే నీవు.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు తీయించుకున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల.. అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఎంటి? అని కేటీఆర్ అంటున్నారు.. నాకు మా అన్న మీద కోపం ఉంటే ఇక్కడ లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది.. ఆ మాటలో నిజం లేదు కాబట్టే… అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టానని సమాధానం ఇచ్చారు. ఇక, బీజేపీతో మాకు పొత్తు…
వరిసాగు కంటే ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం కలెక్టరేట్లో వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్బీకే వ్యవస్థ కొత్తగా రావడంతో ప్యాడీ ప్రొక్యుర్‌మెంట్‌లో గ్యాప్ వచ్చిందన్నారు.. రైతులకు ఈక్రాప్ విశయంలో అవగాహనా లోపం ఓ కారణమన్న ఆయన.. గత ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు సమస్య రావడానికి కొత్త వ్యవస్థే కారణం అన్నారు.. అయితే, రాబోయే ఏడాది ఎలాంటి సమస్య ఉండదని భరోసా…
విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తొలిసారిగా ఏపీ చీఫ్ జస్టిస్‌తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కావడంపై ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వీళ్లిద్దరూ గతంలో పలు సందర్భాల్లో కలుసుకున్నా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. అయితే సీఎం జగన్, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ భేటీ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో పీకే మిశ్రా నేతృత్వంలో ఏపీలో…
ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. గడిచిన 10 రోజులుగా వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మ్యాపింగ్, కోడింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీంతో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడానికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా వెబ్ ల్యాండ్‌లో ఉన్న డేటాను ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం…
టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. తనకు పబ్లిసిటీ పిచ్చి అని బోండా ఉమ ఆరోపణలు చేస్తున్నాడని.. మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని.. కాదు ఆయన చిల్లర రౌడీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న కాలకేయుడు అని..…