ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ధరలకు నిరసనగా బాదుడే బాదుడు పేరుతో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. అందులో భాగంగా.. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయు.. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించి.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే..
* ఈరోజు ఉదయం 10.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న చంద్రబాబు.
* ఉదయం 11 గంటలకు కడప ఇర్కాన్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో ఉమ్మడి కడప జిల్లా సమన్వయ కమిటీ సమవేశం
* మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి కడప జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు.
* మధ్యాహ్నం 1.30 గంటలకు భోజన విరామం
* మధ్యాహ్నం 3 గంటలకు కడప నుండి బయలుదేరి చెన్నూరు, ఖాజీ పేట మీదుగా కమలాపురం చేరుకోన్న చంద్రబాబు..
* సాయంత్రం 4 గంటలకు కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత.