ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ రోడ్లు, తాగునీటి సరఫరాపై సోమవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ఆదేశాల్ని జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన ఈ సమీక్షలో.. రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని జగన్ సూచించారు. టెండర్లు పూర్తి చేసి, జూన్ నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే తాగునీటి సరఫరా పనులకు కీలక ప్రాధాన్యం ఇవ్వాలని…
రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శిరివెళ్లలో ఓ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. ఇదివరకే అన్నదాతకు అండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపట్టిన రైతు భరోసా యాత్ర సమయంలోనూ పవన్ పలువురు రైతులకు ఆర్థికసాయం అందించారు. 41 మంది రైతులకు రూ. 1 లక్ష చెక్‌లను…
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీలో జంగిల్ పాలన సాగుతోందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని తొలుత చంద్రబాబు వ్యాఖ్యానించగా.. వైసీపీ నేతలు తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు. ఏపీలో మహిళలపై జరిగిన ఘటనల విషయంలో…
టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సెటైర్లు వేశారు. ఏపీలో టీడీపీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన కామెంట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు చంద్రబాబును బాదుతారేమోనని.. ఈ విషయాన్ని చంద్రబాబునే అడగాలని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి టీడీపీ నేతలు ఏదో విమర్శలు చేస్తూనే ఉన్నారని.. కానీ తమ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్క అర్హుడికీ లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో పచ్చ చొక్కాలు…
ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పు అంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి జనరేటర్లు ఆన్‌చేశాం అంటారని… తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేశామంటున్నారని.. ఇదంతా ఎంటర్టైన్మెంట్కు పనికొస్తుంది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని అశోక్ గజపతిరాజు…
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యల అంశంపై ఆయన చర్చించారు. మహిళలపై దాడులు, రైతు ఆత్మహత్యలపై పోరాటాలకు పార్టీ కమిటీలు వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లికి పింఛన్ ఇవ్వలేదని ప్రశ్నించిన కుమారుడిపై పోలీసుల దాడిని టీడీపీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని…
బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో అత్యాచారానికి గురైన బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో ఎక్కువశాతం నిందితులు టీడీపీ వాళ్లే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత…
వినియోగదారులకు టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్ పరధిలో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా ఉంది. అయితే ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటే ప్రజలు జంకుతున్నారు. తమ నుంచి వ్యాపారులు కిలో రూ.10కి కొని.. ఇప్పుడు తమ వద్ద పంటలేని సమయంలో వ్యాపారులు సిండికేట్ అయ్యి రూ.60కి అమ్ముతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎండ వేడికి దిగుబడి తగ్గడం,…
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు.. ఆయా ఘటనల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు. ఏపీ గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేటుపై వివరాలను చంద్రబాబు వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు. ఆయా ఘటనల్లో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్…
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భద్రతా చర్యలపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమీక్షించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో వాడుతున్న సీసీ కెమెరాల సంఖ్యను కేంద్ర హోంశాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) వెల్లడించింది. 2021, జనవరి 1వ తేదీ నాటికి దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2,82,558 సీసీ కెమెరాలు ఉన్నట్లు తెలిపింది. అయితే పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సీసీ కెమెరాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు బీపీఆర్డీ పేర్కొంది. ఏపీలో కేవలం 20,968 సీసీ…