ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కలకలం రేగింది. శ్రీవారి ఆలయం సమీపంలో ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని మహిళ కిడ్నాప్ చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్‌కు గురైన బాలుడిని తిరుపతి దామినీడుకు చెందిన గోవర్ధన్ రాయల్‌గా పోలీసులు వెల్లడించారు. కాగా ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి…
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి…సోమవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=6-nSnfl3GBo
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపల్లెలో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించేందుకు బంధువులు రాగా.. పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తక్షణమే బాధితురాలిని చూపించాలని నిరసన చేపట్టారు. అయితే బాధితురాలి బంధువులతో కలిసి కొండేపి టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలి బంధువులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి కాలికి గాయమైంది. అనంతరం…
మేడే సందర్భంగా విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమ, గద్దె రామ్మోహనం, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ.. మూడేళ్ల జగన్ పాలనలో ఒక కార్మికుడు చనిపోయినా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా జగన్ సర్కార్ తినేసిందని విమర్శించారు. ఏపీలో మళ్లీ…
సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఎస్సై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తల్లి వికలాంగురాలు అని.. ఆమెకు వికలాంగురాలి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. వైసీపీ నేత దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన…
తిరుపతిలో జనసేన పార్టీ వినూత్నంగా నిరసన చేపట్టింది. ఇటీవల జగన్ ఒంగోలు పర్యటన సందర్భంగా ఓ కుటుంబం తిరుపతి వెళ్తుండగా రవాణాశాఖ అధికారులు బలవంతంగా కారు తీసుకెళ్లడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సీఎం జగన్ తిరుపతి పర్యటన ఖరారు కావడంతో జనసేన పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. తిరుపతి నగరంలోని బైరాగి పట్టెడ పార్క్ వద్ద ‘జగన్ వస్తున్నాడు కార్లు జాగ్రత్త’ అంటూ వినూత్నంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, పట్టణ…
బాపట్ల జిల్లా రేపల్లెలో వివాహితపై అత్యాచారం కేసుపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించారు. రేపల్లె రైల్వేస్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంటకు మద్యం మత్తులో ముగ్గురు యువకులు భార్యాభర్తల వద్దకు వచ్చారని.. సదరు యువకులు టైం అడిగితే భార్యాభర్తలు వాచ్ లేదని చెప్పడంతో దాడి చేసి నగదు లాక్కున్నారని తెలిపారు. భర్తపై దాడి చేస్తుంటే భార్య అడ్డుపడిందని.. నిందితులు వివాహితను పట్టుకుని అత్యాచారం చేశారని.. ఇద్దరు యువకులు అత్యాచారం చేయగా.. మరొకరు సహకరించారని ఎస్పీ వకుల్ జిందాల్ వివరించారు.…
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పని చేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏప్రిల్ 30వ తేదీ అంటే ఇవాళ్టితో గతంలో పొడిగించిన సమయంలో ముగియడంతో.. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ…
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయతో సమావేశం అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్… రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో పాల్గొన్న తర్వాత కేంద్ర మంత్రితో భేటీ అయిన ఆయన.. వైద్యకళాళాలలకు అనుమతులపై చర్చించారు.. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖ అందించారు ఏపీ సీఎం.. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని.. దీని కోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. కోవిడ్…
జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి యత్నించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ ఫ్యామిలీతో పాటు.. మరికొందరు ఎమ్మెల్యే తలారిపై ఆరోపణలు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహకారంతోనే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులూ చెబుతున్నారు.. మరి ఎమ్మెల్యే తలారి విషయంలో…