శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నాడు హుండీలను లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు నిత్యాన్నదానం హాలులోని హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి, అమ్మవార్లకు రూ.3,09,52,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. అంతే కాకుండా 267 గ్రాముల బంగారం, ఐదు కిలోలకు పైగా వెండి ఆభరణాలు, 323 యూఎస్ డాలర్లు, 197 సౌదీ రియాల్స్, 137…
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రుషికొండలోని హరిత రిసార్టును జగన్ సర్కారు కూల్చివేసింది. దీంతో ఆధునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనను రుషికొండ వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తాళ్లవలసలో బహిరంగ సభలో ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. 2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్గా ఉండాలని తాను ప్రణాళికలు…
ఏపీలో ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు పాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు. రోజురోజుకు మానవత్వం మసకబారిపోతోందని.. తమవారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సహాయం అందించాల్సింది పోయి అక్కడ కూడా డబ్బులు, రూల్స్ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణమని సోము వీర్రాజు మండిపడ్డారు. తిరుపతిలో కాలువలో పడి మృతిచెందిన 10 సంవత్సరాల బాలుడిని ఇంటికి తీసుకెళ్లడానికి తండ్రి నానా అవస్థలు…
ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ఈ సాయంత్రం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాలలో రైతులు వెంటనే పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన…
విశాఖ పర్యటనలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత టీడీపీ కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. పార్టీలో పని చేసే వాళ్ళకే పదవులు, ప్రజలతో ఉన్న వాళ్ళకే నాయకత్వ అవకాశం దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 30 ఏళ్లు అధికారంలో ఉండేలా ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో…
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి వైసీపీ ఖాతాలో చేరింది. ఎంపీటీసీల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీకి మెజారిటీ ఉన్నా తాజా పరిణామాలతో పరిస్థితి తారుమారైంది. ఈ మేరకు దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూపారాణి ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని అధికారులు ప్రకటించారు. దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా… ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో ఎవరూ లేరు.…
ఏపీలో పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతుండటంపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని.. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి లీక్ అయ్యాయని.. మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ ఆరోపించారు. వీళ్ళే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్లను బయటకు…
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి చర్యలపై కోర్టు స్టే విధించింది. వారం క్రితం చింతపూడిలో ‘బాదుడే బాదుడు’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఓ గొడవ చోటు చేసుకుంది. ఆ సందర్భంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో కోర్టుని ఆశ్రయించిన ప్రభాకర్, ఎస్టీ – ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా తాను ఎటువంటి చర్యలకు పాల్పడలేదన్నారు. వాదనలు విన్న కోర్టు, కేసులో తదుపరి చర్యలపై…
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం పెను దుమారంగా మారింది. APSRTC ని ప్రైవేట్ వైపు తీసుకెళ్ళే ఆలోచనలో భాగంగానే అద్దె బస్సుల సంఖ్యని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అనుమానాలు రేకెత్తాయి. అయితే, తాజాగా వీటిని APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు కొట్టిపారేశారు. అద్దె బస్సుల పెంపు వల్ల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయే తప్ప, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.…