ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శలు గుప్పించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమైన రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి తనయుడు జగన్ రెడ్డి మంగళం పలికేందుకు సిద్ధమయ్యారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Read Also: Yadadri Temple: యాదాద్రిలో మళ్లీ మరమత్తులు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు రూ.1000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రైతులు బిల్లులు చెల్లించాక, తదుపరి…
* ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్‌తో రాజస్థాన్ ఢీ, రాత్రి 7.30 గంటలకు లక్నోతో కోల్‌కతా మ్యాచ్ * హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన, ఉదయం 10 గంటలకు ఉద్యమకారులతో రాహుల్ సమావేశం, దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించనున్న రాహుల్, చంచల్‌గూడ జైలులో ఎన్ఎస్యూఐ నేతలను కలవనున్న రాహుల్ గాంధీ * ఏపీలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర బృందం పర్యటన, నేడు కడప జిల్లాలో భూములు పరిశీలించనున్న…
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, వీరపాండ్యన్, అరుణ్ కుమార్‌లకు నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కర్నూలు జిల్లాలో వీఏవో నియామకం విషయంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ధర్మాసనం తీర్పు అమల్లో ఐఏఎస్ అధికారులు నిర్లక్ష్యం వహించినందుకు హైకోర్టు జైలుశిక్ష విధించింది.…
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన కొత్త చిత్రం సర్కారు వారిపాట. ఈ నెల 12 ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర పెంచుకోవచ్చంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఏపీలో రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తరహాలో సర్కారు వారి పాట సినిమాకు…
ఏపీలో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లే అమ్మాయిలకు ఇంటి పేరు మారుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్రంలో చాలా మంది వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లే యువతులు తక్షణమే ఇంటి పేరు మార్చుకుని ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతులు తమ పెళ్లి తర్వాత అత్తింటి తరఫున పేరు మార్చుకునేందుకు వీలుగా గ్రామ సచివాలయంలో…
జగనన్న విద్యాదీవెన పథకం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో జమ అయిన ఈ సొమ్మును వారం, పది రోజుల్లో కాలేజీలకు విద్యార్థుల తల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో నిధులను నేరుగా కాలేజీలకే జమ…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు,…
పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచారు.. అయితే, చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననే నమ్మకాన్ని వ్యక్తం…
చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఫైర్ అయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సోషల్ మీడియా వేదికగా తాజా మాజీ మంత్రి అవంతికి కౌంటర్ ఇస్తూ.. విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలల ఆడియో విడుదల తప్ప ఏమైనా జరిగిందా..? విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయైనా…