టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్‌రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని…
★ ఏపీ హైకోర్టుకు నేటి నుంచి జూన్ 10 వరకు వేసవి సెలవులు.. సెలవుల్లో అత్యవసర పిటిషన్ల విచారణకు వెకేషన్ కోర్టులు ★ నెల్లూరు జిల్లాలో నేడు మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. పెన్నా, సంగం బ్యారేజీల సందర్శన.. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ★ శ్రీకాకుళం : నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ★ గుంటూరు: నేడు డీజీపీని కలవనున్న బీజేపీ నేతలు.. సత్యసాయి జిల్లాలో…
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మధ్య మొదట్నుంచి అక్రమ పొత్తులున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు కూటమికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ రాజకీయ వ్యభిచారి అని.. బీజేపీ పక్కన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇస్తుంటే ఏం అంటారని జోగి రమేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పొత్తుతో తమకు పోయేదేమీ లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వల్ల అందుతున్నాయో ప్రజలకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు…
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యెం మండలంలో ఆదివారం నాడు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు…
అనంతపురం జిల్లాలో దళితుడి ఇల్లు కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడి ఇల్లు కూల్చి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. పేదవాడి ఇల్లు కూల్చివేతకు అంత మంది అధికారులు యుద్ధం చేస్తారా అంటూ నిలదీశారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడేసేందుకు ఎమ్మెల్యే, ఆర్డీవో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చేయడంపై మండిపడ్డారు. అసలు జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం…
ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాన్ క్రమంగా బలపడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 970 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది. రాగల ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుంటుందని తెలిపింది. అనంతరం ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే…
ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌పై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు దుర్భాషలాడుతూ అసభ్య పదజాలాలను వాడుతున్నారని.. ఇది మంచిది కాదని మంత్రి బొత్స హితవు పలికారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ నేతలందరూ కలిసికట్టుగా ఉంటే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన…
ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా అని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదన్నారు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకు తనకు తెలియదని ఎద్దేవా చేశారు. పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. కేవలం తన కుమారుడు మాత్రమే ఇంగ్లీష్…
విశాఖలో జరిగిన వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తల ధైర్యం సీఎం జగన్మోహన్రెడ్డేనని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేస్తామని.. విశాఖను తమ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని ఆమె వివరించారు. గతంలో విశాఖ ఎలా ఉందో. ఇప్పుడు విశాఖ…