ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు.. నిత్యం ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.. ఇక, ఇవాళ కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇవాళ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు పర్యటనకు బయలుదేరనున్నారు సీఎం జగన్… అక్కడి నుంచి గుమ్మటం…
* ఐపీఎల్లో నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్, ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం.. * హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250, * నేడు కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన, ఓర్వకల్ మండలం గుమ్మటం తాండా వద్ద నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న సీఎం. * మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు, ఢిల్లీ…
బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో చేయని నేరానికి తాను 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించానని సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసులో సత్యం బాబు నిర్దోషి అని 2017లో ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని వివరించి తనకు రెండు ఎకరాల సాగు భూమి, రూ.10 లక్షల పరిహారంతో పాటు ఇల్లు ఇవ్వాలని సత్యంబాబు కలెక్టర్‌ను కోరాడు. దీంతో సత్యంబాబుకు సహాయం చేయాలని గతంలోనే నందిగామ ఎమ్మార్వోను కలెక్టర్…
కాకినాడలో అదృశ్యమైన ఓ బాలిక సికింద్రాబాద్‌లో శవమై కనిపించింది.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం కాగా.. చికిత్స పొందుతూప్రాణలు వదిలింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ఎల్లంగిరి ప్రాంతనికి చెందిన మైనర్ బాలిక.. తెనాలికి చెందిన హరికృష్ణతో చనువుగా ఉండేది.. రెండు వారాల క్రితం ఇద్దరు.. ఇళ్లు వదిలి సికింద్రాబాద్ చేరుకోగా.. మారేడుపల్లిలో అపస్మారక స్థితిలో ఉన్న వీరిద్దరిని.. స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు..…
ఏపీ సీఎం జగన్ వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిని వివరిస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పలుచోట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు హయాంలో ప్రజలకు జరిగిన లబ్ధి ఏమీ లేదని.. ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తోందని మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ మీదా జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం…
విజయవాడలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లోనే ఉందని.. దీనిపై చంద్రబాబు చొరవ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్యను మందకృష్ణ కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి టీడీపీ తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని మందకృష్ణ ఆరోపించారు. Andhra Pradesh:…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు కానుంది. బయో డైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేసి ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో విశాఖ, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు బయో డైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన్ను కోరింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించింది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్‌గా పనిచేస్తున్న శైలజానాథ్ అంత యాక్టివ్‌గా లేకపోవడం, గతంలో ఏపీసీసీ చీఫ్‌గా పనిచేసిన రఘువీరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. Adimulapu Suresh: ఏపీలో ఆగస్టు…
ఎండలతో సతమతం అవుతున్న ప్రజానీకానికి ఐఎండీ చల్లని కబురు అందించింది. భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ఆగమనం చేశాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు వివరించింది. అంతేకాకుండా బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడుకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు…
విజయవాడలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. స్విగ్గీ సంస్థ పని గంటలు పెంచడంతో పాటు ఇన్సెంటివ్స్ తగ్గించడంతో డెలివరీ బాయ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఇన్సెంటివ్స్ తగ్గించిన నేపథ్యంలో తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెంచకుండా తగ్గించటం పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడినా తమకు రూ.270 మాత్రమే వస్తున్నాయని.. పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా తొలగించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. Read Also: Illegal Affairs: ఏపీలో మగాళ్లు…