★ నేడు తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. ఇప్పటికే గోవా, కొంకణ్, కర్ణాటకకు విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం
★ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేంద్రమంత్రి జయశంకర్ పర్యటన.. పాడేరు ఏజెన్సీలో పర్యటించనున్న జయశంకర్.. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు, కాఫీ ప్లాంటేషన్‌ల పరిశీలన
★ తిరుమల: ఇవాళ జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు.. ముత్యపు కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
★ నేటి నుంచి శ్రీశైలంలో మూడురోజుల పాటు నూతన అన్నపూర్ణదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం.. నేడు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, అంకురారోహణ, అగ్నిప్రతిష్టాపన
★ గుంటూరు: నేడు పెదకాకాని మండలం అనమర్లపూడిలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను పరిశీలించనున్న టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర
★ తెలంగాణలో నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం.. సెలవులు పొడిగించేది లేదని స్పష్టం చేసిన విద్యాశాఖ
★ ఢిల్లీ: నేడు ఈడీ ముందు హాజరుకానున్న రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు.. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల అవకతవకలపై నోటీసులు జారీ.. ఈడీ నోటీసులను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు