ఎడమ చేతి చూపుడు వేలుకు రింగ్ ధరించారు చంద్రబాబు.. ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ కావడం మరో విశేషం.. ఆ రింగ్‌లో మైక్రో చిప్ అమర్చబడి ఉంటుందని తెలిపారు చంద్రబాబు.
వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి..
జన్మనిచ్చిన తల్లిదండ్రులలే కొందరు భారంగా భావిస్తున్నారు.. కనీసం వారికి తిండి పెట్టి, బాగోగులు కూడా చూసుకోకుండా ఇళ్ల నుంచి వెళ్లగొడుతున్నారు.. వారు జీవితంలో సంపాదించింది, ఆస్తులు లాగేసుకోవడమే కాదు.. మమ్మల్ని కన్నారు, పెంచి పెద్దచేశారు, విద్యాబుద్ధులు నేర్పారు, వారిని మేం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అనే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొందరైతే చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు ఎన్నో చూశాం.. ఇలాంటి పరిస్థితుల్లో జీవించడమే వ్యర్థమని ఇప్పటికే ఎంతో మంది పండుటాకులు రాలిపోయారు, ఆత్మహత్యలకు పాల్పడ్డారు..…
రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 203 పల్లె వెలుగు, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 70 ఎక్స్‌ప్రెస్, 22 అల్ట్రా డీలక్స్, 46 సూపర్ లగ్జరీ, 9 ఏసీ స్లీపర్, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర బస్సులు, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. నేటి…
చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. లేని సమస్యలు సృష్టించి మరీ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను సభ రాకుండా అక్రమ కేసుకు పెడుతారా.. వైసీపీ దొంగల్లారా… తాను కనుకగా కన్నెర్ర చేస్తే ఇంటిలో నుండి బయటకు కూడా రాలేరన్నారు.…
ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై ఆరోపణలు చేశారు. టీడీపీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాలుగు పార్ట్నర్షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు…
ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:10 గంటలకు పార్టీ జెండాను వైసీపీ…
పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు…