Bar Licenses bidding in online: బార్ లైసెన్సుల జారీకి ఏపీ ప్రభుత్వం డోర్లు ఓపెన్ చేయడంతో వ్యాపారులు ఎగబడ్డారు. తొలిసారి ఆన్‌లైన్ విధానంలో బిడ్డింగ్ నిర్వహిస్తుండగా భారీ స్పందన కనిపించింది. లైసెన్స్ ఫీజులు., లిక్కర్ సప్లయ్ రూపంలో ఖజానాకు వేల కోట్ల రుపాయలు జమ కానున్నాయి. అదే సమయంలో తొలిసారి ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వ హిస్తుండగా….లైసెన్సులు జారీలో పారదర్శకతకు అవకాశం కలిగింది.
ఏపీ ఎక్సయిజ్ శాఖకు ఊహించని కిక్కు దొరికింది. నూతన బార్ లైసెన్స్ విధానానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ విధానం బార్లు దక్కించుకున్న నాటి నుంచి 2025 వరకూ అమల్లో ఉంటుంది. లిక్కర్ సేల్స్ పెరుగుతున్న క్రమంలో బార్లపై పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించడం కనిపించింది. ధరలు పెరుగుదల, మద్య ని షేధం అమలు వంటి చర్యలు నూతన విధానంపై ఎటువంటి ప్రభావం చూపించలేదు. కేవలం ఫీజుల రూపంలోనే ఖజానాకు వందల కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖలో పోటీ మరీ ఎక్కువగా ఉంది. స్టీల్ సిటీలో బార్లను సంపాదించేందుకు ఎక్కువ ఉత్సాహం ప్రదర్శించగా ఆ మేరకు ఆదాయం గతం కంటే అనేక రేట్లు పెరగనుంది. 2017-22 బార్ పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజు గరి ష్టంగా 44లక్షలు ఉండేది. బిడ్డిం గ్ కూడా ఎక్సయిజ్ అధికారుల ప్రయమేయంతో జరిగేది. అయితే బార్ పాలసీలో మార్పులు చేసిన ప్రభుత్వం ఎవరు ఎక్కడి నుంచైనా పోటీపడే అవకాశం కల్పించింది. లైసెన్స్ ఫీజులను పెంచడమే కాకుండా నాన్ రిఫండబుల్ విధానం అమలు చేసింది. ఫలితంగా పెద్దనగరాల్లో 60 లక్షలు., జనాభా 5లక్షలు దాటిన మున్సిపాలిటీల్లో 35లక్షలు, మిగిలిన టౌన్లలో 15లక్షలుగా నిర్ణయించారు.
విశాఖ జిల్లాలో ఇదీ పరిస్థితి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 128 బార్లు, 15స్టార్ హోటళ్లు, 2 మైక్రో బ్రేవరేరీలు, 5 క్లబ్బులు ఉన్నాయి. అనకాపల్లిలో 4, నర్సీపట్నంలో రెండు, యలమంచిలిలో ఒకటి చొప్పున బార్లు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం ఒక్క విశాఖ నుంచే సుమారు 5 కోట్లు ఫీజుల రూపంలో సమ కురుతుందని ఎక్సయిజ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి. ప్రస్తుతం విశాఖలో 78 ప్రభుత్వ వైన్ షాపు లు ఉండగా ఇక్కడ రోజుకు అయ్యే సేల్స్ సుమారు రెండు కోట్లు. శని,ఆదివారం, ప్రత్యేకమైన రోజుల్లో విక్రయాలు సగం పెరుగుతాయి. ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లతో పాటు రిచ్ లుక్ వుండే బారుల్లో ఎంజాయ్ చేసేందుకు లిక్కర్ బాబులు రెడీ అంటున్నా రు. కొత్త విధానం ప్రకారం ఒక్క విశాఖ గ్రేటర్ నగర పరిధిలో సేల్స్ 8 నుంచి 10కోట్ల మధ్య నమోదు అవుతుందని ఎక్సయిజ్ శాఖ లెక్కలు వేసుకుంటోంది. అదే సమయంలో అన్ని బ్రండ్లు మెయింటెయిన్ చెయ్యడానికి కనీసం 50లక్షలు అవసరం. మొత్తం వైన్ షాపులు,బార్లు కలుపుకుని ఏటా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క విశాఖ నుంచే వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మద్యం బార్ల లైసెన్సులకు రాష్ట్ర ప్రభుత్వం తెర లేపింది. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తును ప్రారంభించారు. శు క్రవారం నుంచి దరఖాస్తులను రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాలను 4 జోన్లుగా రాష్ట్ర ప్రొహిబిషన్ విభజించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి: సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు: విశాఖపట్నం జోన్ -1 పరిధిలోకి వస్తున్నాయి. దరఖాస్తుతో పాటు ఫీజులను జనాభాను బట్టి దరఖాస్తుదారుడు చెల్లించాలి. ఈ ఫీజు తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించబడదు. 50 వేలజనాభా వరకూ రూ. 5 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా వరకూ రూ.7,50 లక్షలు, 5. లక్షల జనాభా దాటిన ప్రాంతాల్లో లైసెన్సు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 27లోగా జోన్ -1 పరిధిలోని జిల్లాల్లో దరఖాస్తులు చేసుకోవాలి. 28న విత్ డ్రాలు, 29 తేదీన దరఖాస్తుల స్క్రూటినీ ఉంటుంది. 30న ఇ-వేలం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ షాపుల వేలం జరుగనుంది. బినామీ బిడ్లకు అనుమతి లేదు. ఏ ప్రాంతంలో ఎన్ని బార్లు ప్రారంభించాలో డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ చూసుకుంటుంది.
126 బార్లలో 80 నగరంలోనే… దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేసేలా తాగేవారిని అసంతృప్తికి గురిచేస్తామని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగూ ముందుకేయలేదు. మద్యం విషయంలో ఎలాంటి విధానం తీసుకున్నా సర్కారు ఖజానాకు జనం సొమ్ము జమ అయిపోతోంది. బెల్టు షాపులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం మద్యం మాఫియా నడుపుతోంది ? అన్నవిమర్శలకు తగ్గట్టుగానే ఆదాయం ఏటా పెరుగుతోంది. 2014కు ముందు జిల్లా ఒక రోజు ఆదాయం రూ.7 కోట్లు కాగా… ఒక రోజు సరాసరి లిక్కర్ అమ్మకం తాజాగా విశాఖ జిల్లా మొత్తంగా ఒక రోజు సరాసరి లిక్కర్ అమ్మకం కోట్లు ఉంది. పండగలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో అయితే రూ. 15 కోట్లకు వెళుతోంది.
జిల్లా మొత్తం సుమారు 265 లిక్కర్ షాపులున్నాయి. బార్ లు పైన తెలిపినట్లు 126 వరకూ ఉన్నాయి. అందులో నగరంలోనే సింహభాగం ఆక్రమించాయి. మద్యం విక్రయాలు విపరీతంగా సాగుతున్నాయి. పైగా నాసిరకం మద్యం, గతంలో ఇలాంటి మందు ఎప్పుడూ తాము చూడలేదని మందుబాబులు చెబుతూనే తాగేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టేందుకు జీవో నెం. 411 ద్వారా 3500 పైచిలుకు సూపర్వైజర్లు, 8 వేల మంది సేల్స్మ్యన్లను నియమించుకుంది. ఎక్సైజ్ శాఖ నియంత్రణలో వీరే అమ్మకాలు సాగిస్తున్నారు. ఫేమస్ బ్రాండ్లు ఏవీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరకడం లేదన్నది జగమెరిగిన సత్యం. వింత పేర్లతో బ్రాండ్లు వస్తున్నాయి. ఈ నెల 27 వరకూ దరఖాస్తులకు ఆహ్వానం పలకడంతో విశాఖ నగరం, జిల్లాలో ప్రముఖ సెంటర్లలో బార్ల లైసెన్సుల కోసం ఇన్వెస్టర్లు తెగబడుతున్నారు.