YSR Kapu Nestham: కాపులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. రేపే నిధులు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాపులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్న ఆయన.. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.. దీనికోసం, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రేపు జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సర్వసిద్దం చేశారు అధికారులు.. కాపునేస్తం మూడవ విడత నిధులు విడుదలకు గొల్లప్రోలు వేదికగా మారింది.. మూడవ విడత కాపునేస్తo నిధులు ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమచేయనున్నారు.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు.. ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు.. అనంతరం వైఎస్సార్ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం.
ఇక, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ గితావిశ్వనాథ్‌లు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించారు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారిపొడవునా ఫ్లెక్సీలతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. గొల్లప్రోలు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని హెలిపాడ్ వద్ద దిగి రోడ్డు మార్గంలో పట్టణ శివారులోని ఈబీసీ కాలనీ సమీపంలో గల ప్రవేటు లేఅవుట్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇప్పటికే హెలిపాడ్, సభావేదికలు సిద్ధం చేసి, సీఎం వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకoగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం ప్రయాణించే బస్సు, హెలికాప్టర్, కాన్వాయ్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు.
Also Read
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
కాపునేస్తం పథకం ద్వారా కాపు సామాజికవర్గానికి చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సగటున 3.2లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. కాపు నేస్తం కోసం ప్రభుత్వం సుమారు రూ.490 కోట్ల రూపాయాలు వెచ్చిస్తోంది.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు.. అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేల ఆర్దిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75 వేల ఆర్దిక సహాయాన్ని అందిస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?