Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే…
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు.…
Tirumala Temple: ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయం రెండు రోజుల పాటు మూతపడనుంది. సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ నెలలో ఒక రోజు, నవంబర్ నెలలో మరో రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటనలో టీటీడీ పేర్కొంది. అక్టోబరు 25న మంగళవారం సాయంత్రం 5:11 గంటల నుండి 6:27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది.…
ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్లో రోడ్డుపై నిలిపి ఉన్న బ్యాటరీ బైక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొదట పొగలు వచ్చి.. ఆ తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది.
Andhra Pradesh: ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైఎస్ఆర్ చేయూత పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుండగా.. ఆ రోజు నుంచి వారం రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ.18,750…
Botsa Satyanarayana: ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని ఏపీలో ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అధికారంలోకి వచ్చాక పూర్వపరాలు చర్చిస్తే సీపీఎస్ రద్దు సాధ్యం కాదని తేలిందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారని..…
CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన పలువురు మంత్రుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా.. మంత్రులు స్పందించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మంత్రులు తీరు మార్చుకోకపోతే కేబినెట్లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారు. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని తప్పించడానికి వెనకాడనని…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశం బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కొంత స్పష్టతకు ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సీపీఎస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని జేఏసీలతో జీవోఎమ్ భేటీ కానుంది. జీపీఎస్‌లో మరింత మెరుగైన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలకు వివరించాలనే ఆలోచనలో…
Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తనపై ఫేక్ వీడియోను క్రియేట్ చేసి పరువు తీశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం నాడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన సీఐడీ అడిషనల్ డీజీకి లేఖ రాశారు. మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పనిచేస్తోందని…