Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది.. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో స్పష్టత ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ambati Rambabu: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడు.. ఆయన ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లకు చెబుతున్నాను.. పవన్‌ను చూస్తే జాలేస్తోంది.. వీర మహిళలు, జన సైనికులు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో మీకు స్పష్టత ఉందా..? అంటూ ప్రశ్నించారు.. మీ నాయకుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు? బీజేపీతో పొత్తులో ఉన్నామంటారు… టీడీపీకి కన్ను కొడతారు.. చంద్రబాబు విదిలించే మెతుకుల కోసం తాపత్రయ పడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..
Read Also: Minister Gudivada Amarnath: అది జరిగితే బంగాళాఖాతంలో దూకడం తప్ప మరో మార్గం లేదు…!
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
నేను చంద్రబాబు దత్త పుత్రుడిని కాదు అని ఎందుకు చెప్పటం లేదు..? అని పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించారు అంబటి రాంబాబు.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యం పవన్ కల్యాణ్‌కు ఉందా? అని సవాల్ విసిరిన ఆయన.. ఈ నెల 15న విశాఖలో ర్యాలీ చేపట్టనున్నట్లు ముందుగా ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్నారు.. అయితే, పవన్ కల్యాణ్ అదే రోజు విశాఖలో పర్యటన పెట్టుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. ఉత్తరాంధ్రను రెచ్చగొడితే మాడి మసై పోతారు అంటూ హెచ్చరించారు.. తాము ఈ యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలను చైతన్యవంతులను చేయటానికే నిర్వహిస్తున్నామన్న ఆయన.. అమరావతి రైతులది పాదయాత్ర కాదు, ఫేక్ యాత్ర.. ఉత్తరాంధ్ర వాసుల్ని రెచ్చగొడితే మాడి మసైపోతారు అని వ్యాఖ్యానించారు.. పాదయాత్ర చేసే వారు సూర్యదేవాలయానికి వెళ్తున్నారు.. భగభగమండే సూర్యుడు దగ్గరకు వెళతాం అంటున్నారు.. సూర్యుడు బుగ్గి చేసేస్తాడు.. అందుకే పాదయాత్ర విరమించి మీ చంద్రుడి (చంద్రబాబు) దగ్గరకు వెళ్లండి అంటూ సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?