ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతోంది… మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తేదీన విశాఖ గర్జనకు పిలుపునిచ్చింది జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)… ఆ పిలుపునకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందే.. అయితే, అదే రోజు జనసేన అధినేత విశాఖకు రానున్నడం ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతుంది.. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు విశాఖలో జనసేనాని పర్యటన కొనసాగనుంది… ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 15న విశాఖలో అడుగుపెట్టబోతున్నారు పవన్.
Read Also: Aadhaar card update: మీ ఆధార్ కార్డుకు పదేళ్లు నిండాయా? వెంటనే ఈ పని చేయాల్సిందే..!
పవన్ కల్యాణ్ వైజాగ్ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 15వ తేదీన మధ్యాహ్నం విశాఖ చేరుకోనున్నారు పవన్.. అదే రోజు విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన నాయకులతో పార్టీ ప్రణాళికలు, అమలు అంశాలపై చర్చించనున్నారు.. ఇక, 16న ఉదయం 9 గంటలకు పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జిల్లాల ‘జనవాణి’ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.. ప్రజల నుంచి సమస్యలపై వచ్చే అర్జీలను స్వయంగా స్వీకరిస్తారు.. సమస్యలను తెలుసుకుంటారు. అదే రోజు సాయంత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు.. ఇక, 17వ తేదీన ఉదయం మీడియాలో మాట్లాడనున్న జనసేనాని.. అనంతరం బీచ్ రోడ్డులోని వైఎంసీఏ హాల్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం అవుతారు. అయితే, 15వ తేదీన ఓవైపు విశాఖ గర్జన.. మరోవైపు పవన్ కల్యాణ్ పర్యటన ఉండడంతో.. ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి.. అనేది ఉత్కంఠగా మారింది.