Minister Ambati Rambabu: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నాడు.. ఆయన ఏదో సాధిస్తాడని నమ్మే వాళ్లకు చెబుతున్నాను.. పవన్‌ను చూస్తే జాలేస్తోంది.. వీర మహిళలు, జన సైనికులు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో మీకు స్పష్టత ఉందా..? అంటూ ప్రశ్నించారు.. మీ నాయకుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు? బీజేపీతో పొత్తులో…
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారంపై రచ్చ సాగుతూనే ఉంది.. ఓవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు.. వికేంద్రీకరణ జరగాలి.. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న వేళ.. విశాఖ రాజధాని కావాలంటూ.. ఓ ఉద్యమం జరుగుతోంది.. ఈ నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమం హైదరాబాద్…
YS Jagan Mohan Reddy: వ్యవసాయ మోటార్లకు మీటర్ల ద్వారా చాలా విద్యుత్ ఆదా అయ్యిందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయనకు.. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని వివరించారు విద్యుత్‌శాఖ అధికారులు.. విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశారు.. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు…
చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉంటాయి.. ఆయనకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసం చౌకబారు ఎత్తుగడలు వేయదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసమానత కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల వారివేనని వెల్లడించారు. ఒక ప్రాంతం నెగ్లెట్ కావడంతో తమ ప్రాంతం బీదవారిగా మారిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు ఏపీలో ఒక్క విశాఖలో మాత్రమే ఉన్నాయని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే…
Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే…
AP High Court: తెలుగులో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోపై మరో వివాదం చెలరేగింది. బిగ్‌బాస్-6ను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని.. ఈ షో హింస, అశ్లీలం, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపిస్తూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు పరిష్కరించే ముందు అసలు ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము ఒకట్రెండు ఎపిసోడ్లు…
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2022 ఆగస్టు 1 నుంచి 2023 మార్చి 31 వరకు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం గడువును పొడిగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల…
Andhra Pradesh: ఏపీలో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలోని సెక్రటేరియట్లో విధులు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఫేస్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారులు ఫోన్లలో ఫేస్ రికగ్నేషన్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల ఆరో తేదీ నుంచి ఫేస్ రికగ్నేషన్…