TTD Assets: ఆ ప్రముఖ కంపెనీల కన్నా.. తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన కానుకలను శ్రీవారికి సమర్పించుకుంటారు. తిరుమలలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు ఉచితంగా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో అన్నదాన ట్రస్టుకు కూడా భక్తులు భారీగా విరాళాలను సమర్పిస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీల్లోని పలు ఆలయాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంది.
Read Also: Minister KTR : ఫేకుడు… జోకుడు తప్ప ఎన్నికల్లో బీజేపీ దగ్గర ఏమి లేదు
Also Read
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
కాగా 1933 నుంచి గమనిస్తే తొలిసారిగా టీటీడీ ఇటీవల తిరుమల శ్రీవారి ఆస్తులను ప్రకటించింది. శ్రీవారి ఆస్తుల్లో 10.25 టన్నుల బంగారం, 2.5 టన్నుల ఆభరణాలు, రూ. 16వేల కోట్ల నగదు ఉన్నాయి. ఇవన్నీ బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా టీటీడీకి దేశవ్యాప్తంగా 960 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ మొత్తం విలువ రూ. 2.5లక్షల కోట్లుగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. శ్రీవారి సంపదను స్టాక్ మార్కెట్లోని సంస్థలతో పోల్చి చూస్తే ఎన్నో ప్రముఖ కంపెనీల నెట్ వర్త్ కన్నా శ్రీవారి ఆస్తులే అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది.
ప్రస్తుతం బెంగళూరు ఆధారిత ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మార్కెట్ క్యాపిటల్ రూ. 2.14లక్షల కోట్లుగా ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్స్ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ. 1.99లక్షల కోట్లు. అంతర్జాతీయ ఫుడ్ అండ్ డ్రింక్ సంస్థ నెస్లేకి చెందిన ఇండియా విభాగం మార్కెట్ క్యాపిటల్ రూ. 1.96లక్షల కోట్లుగా ఉంది. వీటితో పాటు ఓఎన్జీసీ, ఐఓసీ, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మమీంద్రా, టాటా మోటార్స్, కోల్ ఇండియా, వేదాంత, డీఎల్ఎఫ్‌తో పాటు ఎన్నో సంస్థల మార్కెట్ క్యాపిటల్ శ్రీవారి ఆస్తుల కన్నా తక్కువగానే ఉన్నాయి. అయితే బీఎస్ఈలో 6వేలకు పైగా కంపెనీలు లిస్ట్ కాగా వీటిలో సుమారు 30 సంస్థల మార్కెట్ క్యాపిటల్ మాత్రమే శ్రీవారి అస్తుల కన్నా ఎక్కువగా ఉంది. రిలయన్స్ సంస్థ క్యాపిటల్ రూ. 17.53లక్షల కోట్లుగా, టీసీఎస్ సంస్థ క్యాపిటల్ రూ. 11.76లక్షల కోట్లుగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యాపిటల్ రూ. 8.34లక్షల కోట్లుగా, ఇన్ఫోసిస్ క్యాపిటల్ రూ. 6.37లక్షల కోట్లుగా, ఐసీఐసీ బ్యాంక్ క్యాపిటల్ రూ. 6.31లక్షల కోట్లుగా ఉంది. వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
- Tags
- Andhra Pradesh
- BSE
- coal india
- ioc
- NTPC
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..