ఎన్ఆర్ఐ ఆస్పత్రులపై తాము చేసిన సోదాల విషయమై ఈడీ ప్రకటన విడుదల చేసింది.. ఈ నెల 2, 3వ తేదీల్లో ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని కొంతమంది సభ్యులు, ఆఫీస్ బేరర్‌లపై విజయవాడ, కాకినాడలోని వివిధ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించాం… 53 అనుమానస్పదంగా ఉన్న వివిధ స్థిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాం. మనీ ల్యాండరింగ్ జరిగినట్టుగా అనుమానం కలిగిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. ఇక, కొన్ని హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నాం… గుంటూరు, హైదరాబాద్‌తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురి ఆస్తులను స్తంభింప చేశాం.. కొంత నగదును స్వాధీనం చేసుకున్నామని.. ఏపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ఎస్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద దర్యాప్తు చేశామని పేర్కొన్నారు.
Read Also: YS Jagan: బీసీల హృదయంలో జగన్.. జగన్ హృదయంలో బీసీలు
ఇక, సొసైటీకి చెందిన కొంత మంది సభ్యులు సొసైటీ నిధులను మళ్లించారనే ఆరోపణలపై విచారించామని వెల్లడించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. భవనాల నిర్మాణం పేరుతో సొసైటీని పెద్ద ఎత్తున వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంది.. రికార్డుల్లోని లెక్కల కంటే ఎక్కువ మొత్తంలో కోవిడ్ రోగుల నుంచి వచ్చిన డబ్బును మళ్లించారన్న అంశంపై సోదాలు చేపట్టామని.. అన్ని వ్యవహారలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో సోదాలు పూర్తి అయ్యాయి.. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే విచారణ జరిగిందని.. సొసైటీ సభ్యులు ఎన్నారై అకాడమీ నిధులతో సొంత భవనాలు నిర్మించుకున్నారని పేర్కొంది. కోవిడ్ సమయంలో భారీగా అక్రమాలు చేసి ఆర్థికంగా లబ్దిపొందారని.. మెడికల్ సీట్ల కేటాయింపుల్లోనూ అక్రమాలు చేశారని.. సొసైటీ అకౌంట్‌కు వచ్చిన నిధులన్నీ మరో అకౌంట్‌కు బదిలీ చేశారని.. ఎన్‌ఆర్‌ఐఎస్ అనే అకౌంట్ తెరచి నిధులు మళ్లించారని.. 53 ఆస్తులకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నాం.. రూ.కోట్ల నిధుల మల్లింపుపై ఆధారాలు లభ్యమయ్యాయని తన ప్రకటనలో పేర్కొంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.