Bonda Uma: కందుకూరు, గుంటూరు ఘటనలపై సీబీఐ ఎంక్వయిరీ వేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonda Uma: పోలీసుల వైఫల్యమే కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు కారణమని.. ఆ రెండు ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు.. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను పక్కదారి మళ్లించేందుకు ప్రతిపక్షపార్టీ నేతలపై వేధింపుల తీవ్రత పెరుగుతోందని.. చంద్రబాబు సభలు, సమావేశాలకు వచ్చే జనాలను చూసి సీఎం వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.. జగన్ ఫెయిల్యూర్ సీఎం.. చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వస్తున్నారంటే జగన్ పనైపోయినట్టే అని జోస్యం చెప్పారు.. రాష్ట్రంలో జీవో 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీ జగన్ అమలు చేస్తున్నారు.. 1981లో బ్రిటీష్ పాలనకు బూజులు దులిపి.. నేడు ప్రతిపక్షాల గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా అరాచక సృష్టించారు. పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Karnataka: హంగ్ దిశగా కర్ణాటక.. ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడి
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు డిసైడ్ చేస్తారట? అని ఎద్దేవా చేశారు బోండా ఉమ.. ఆనాడే జాతిపిత గాంధీ ప్రజాస్వామ్యాన్ని, విలువలను తుంగలో తొక్కే బ్రిటిష్ చట్టాలను వ్యతిరేకించారు. జగన్ ఫెయిల్యూర్ సీఎం అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తాలిబన్ చట్టాలను సైతం జగన్ అమలు చేసే అవకాశం ఉందన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకునేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేశాం. చరిత్రలో నియంతలు మనుగడ సాగించలేరని పేర్కొన్నారు. ఇవాళ జగన్ నియంతలా వ్యవహరిస్తున్నాడు.. టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు వందల మంది పోలీసులను పెట్టారు.. మా పార్టీ నేతల ఇళ్ల ముందు పోలీసులు.. ఏంటీ ఈ అరాచకం..? కుప్పంలో మాజీ సీఎం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయడం తప్పా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఒక రోజు ఉంటుందని తెలుసుకో జగన్ అంటూ హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అధికారులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. జగన్ రెడ్డి చెప్పినదానికి తల ఊపితే అధికారులు ఇబ్బందులకు గురవుతారు.. అక్రమ అరెస్టులకు మేం భయపడబోమని ప్రకటించారు.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..