Anam Ramnarayana Reddy: ఏపీలో జగన్ ప్రభుత్వంపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఏడాది ముందే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీకి ప్రజలు అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆనం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం సాంకేతిక కారణాలా లేదా బిల్లుల చెల్లింపు జాప్యమా అనేది తెలియడంలేదన్నారు. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు…
Gorantla Buchaiah Chowdary: ఏపీలో వైసీపీ సర్కారు తెచ్చిన జీవోపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల సుబ్బయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్‌ను ఆధారం చేసుకుని ప్రభుత్వం జీవో నెం.1 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన…
SomiReddy: ఏపీలో బహిరంగ సభలు, రోడ్డు షోలపై వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆంక్షలు విధిస్తూ ప్రత్యేకంగా జీవో విడుదల చేయడాన్ని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరుపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టరాదన్న ప్రభుత్వ నిర్ణయం హేయమని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు ఇవే ఆంక్షలు ఉండి ఉంటే దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో…
Janasena Party: ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. సీఎం హోదాలో జగన్ బెంజ్ సర్కిల్లో కార్యక్రమాలు చేయలేదా అని విమర్శించారు. బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ వాహనాలకు జగనే స్వయంగా జెండాలు ఊపలేదా అని నిలదీశారు. అప్పుడు ప్రజలకు కలిగిన…
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాత్.. అనకాపల్లిజిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన ఫ్యాన్స్ కలలు కంటున్నారు.. అయితే, ‘సీఎం పవన్ కళ్యాణ్’ పేరుతో సినిమా తీస్తే నేనే ప్రొడక్షన్ చేస్తానన్నారు.. అంటే, పవన్ కల్యాణ్‌ను తెరపై సీఎంగా చూసుకోవచ్చు.. నిజ జీవితంలో ఆయన సీఎం కాలేరనే తరహాలో ఎద్దేవా చేశారు..…
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. రోడ్లపై బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.. చంద్రబాబు సభలపై నేను డీజీపీకి ఫిర్యాదు చేసి.. కోర్టుకు వెళ్లాక వైఎస్ జగన్ ఇప్పుడు జీవో జారీ చేశారు.. అందుకు సీఎం జగన్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. చంద్రబాబు కంటే వైఎస్ జగన్ వేయి రెట్లు బెటర్ అంటూ ఆకాశానికి…
Minister RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.. అయితే, ఏపీలోని అధికార, విపక్ష నేతలు.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు స్థానం లేదంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి ఆర్కే రోజా.. తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పార్టీని (బీఆర్ఎస్) ప్రజలు ఆదరించబోరన్నారు.. విభజన చట్టంలో హమీలను నేరవేర్చని పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. Read Also: Rajamahendravaram: సీఎం జగన్ సభలో అపశృతి ఇక,…
Rajamahendravaram: తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నసభలో అపశృతి చోటు చేసుకుంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పింఛన్ కానుక సభకు విచ్చేసిన 70 ఏళ్లకు పైగా ఉన్న వృద్ధురాలు.. బస్సు నుండి దిగుతూ జారిపడిపోయింది.. ఆ వెంటనే పక్కనే ఉన్న మరో వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలపాలైంది.. వృద్ధురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో.. అప్రమత్తమైన వైసీపీ శ్రేణులు.. ఆ వృద్ధురాలిని కాకినాడ ఆసుపత్రికి…