Traffic Jam: టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ టైంవేస్ట్ చేసుకోవద్దన్న సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Jam: సంక్రాంతి పండగ రద్దీ మొదలైంది. విద్యాసంస్థలకు వారం రోజుల సెలవులు రావడంతో పండగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. దీంతో.. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క పండక్కి వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహా ఇచ్చారు.
సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండి. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు. pic.twitter.com/oENrGRC1QH
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
— Managing Director – TSRTC (@tsrtcmdoffice) January 13, 2023
ఇక.. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించండని సూచించారు. సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండంటూ సలహా ఇచ్చారు. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండని తెలిపారు. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారంటూ ట్వీట్ చేశారు సజ్జనార్. ఇక.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దీంతో సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండేవి ఇక అదనపు సిబ్బందిని నియమించామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్ రాకేష్ తెలిపారు. దీంతో.. రైళ్లు ఏ సమయానికి.. ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా సహాయకులను అదనంగా సమకూర్చామన్నారు. ఇక.. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి పెంచామన్నారు. దీంతో.. టిక్కెట్ తనిఖీ సిబ్బందిని రెట్టింపు చేశామన్నారు. ఈనేపథ్యంలో.. 60 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బంది.. 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా చూస్తున్నామన్నారు.
Doctors Not Negligent: ఇద్దరు బాలింతల మృతి.. వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడా లేదన్న డాక్టర్ సునీత
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!